రుణ విముక్తి

Aug 2 2021 @ 23:03PM

  • రెండో విడతలో రూ.50వేలలోపు రైతురుణ మాఫీ  
  • ఉమ్మడి జిల్లాలో 50వేల మందికిపైగా ప్రయోజనం
  • ఈనెల 15వ తేదీ నుంచే ప్రారంభం 
  • అన్నదాతల్లో ఆనందం


రైతన్నకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సీఎం కేసీఆర్‌ రెండో విడత రుణమాఫీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో అన్నదాత ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 50వేల మందికిపైగా లబ్ధి చేకూరనుంది. త్వరలోనే డబ్బు బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.


 (ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : రెండో విడత రుణమాఫీపై ఎట్టకేలకు సర్కార్‌ తీపికబురు అందిం చడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవు తోంది.  రెండో విడత రుణమాఫీ కోసం ఉమ్మడి జిల్లాలో రైతులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో రెండో విడత మాఫీ నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో సుమారు 50వేలమంది రైతులకు పైగా రుణవిముక్తి లభించనుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంగర్‌ కలాన్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ రైతు రుణమాఫీపై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రూ. లక్షలోపు పంట రుణాలు మాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రెండో విడత పగ్గాలు చేపట్టిన తరువాత రుణమాఫీని నాలుగు విడతలుగా అమలు చేస్తామని చెప్పారు.  2018 డిసెంబర్‌ 11 నాటికి రుణం తీసు కున్న వారికి ఇది వర్తిస్తుందని ప్రకటిం చారు. అయితే వెంటనే ఈ ప్రక్రియ చేపట్టలేదు. ఒక ఏడాదిన్నర ఆలస్యంగా అంటే గత ఏడాది తొలి విడత రూ. 25వేలలోపు రుణం తీసుకున్న రైతు లకుమాఫీ చేశారు. ఇవి కూడా అర్హులం దరికీ దక్కలేదు. ఆధార్‌కార్డు లింక్‌ కాక పోవడం,  పాస్‌బుక్‌ల్లో తప్పిదాలు జరి గిన వారికి రుణమాఫీ వర్తింప చేయ లేదు. దీంతో దాదాపు 40శాతం మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. ఇదిలా ఉంటే రెండో విడత రుణమాఫీ ఈ ఏడాది ఆరంభంలో చేస్తామని ప్రకటించారు. అయితే ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో సర్కార్‌ రెండో విడత నిధులు విడుదల చేయలేకపోయింది. ఇదిగో రుణమాఫీ... అదిగో రుణమాఫీ అంటూ ఆలస్యం చేయడంతో  రైతులు వడ్డీల భారం భరించలేక ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతుల అప్పులు కొండలా పెరిగాయి. తమ బ్యాంకు బాకీలకు వడ్డీ కట్టలేక సతమతమవుతు న్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమైన ప్పటికీ రెండో విడత రుణమాఫీ డబ్బులు ఇప్పటికీ విడుదల కాకపోవ డంతో చిన్న, సన్నకారు రైతులు పంటల సాగుకు నానా కష్టాలు పడుతున్నారు. ఈ సమయంలో పాత బకాయిలు కట్టా లంటూ బ్యాంకుల నుంచి కూడా వత్తిళ్లు వస్తున్నాయి. రుణమాఫీపై స్పష్టత లేకపోవడంతో రైతులు వడ్డీలు చెల్లించడం లేదు. దీంతో వారి బకాయిలు తడిసి మోపెడవుతున్నాయి. రైతు వడ్డీ కోసం  కేంద్రం నుంచి రావాల్సిన వాటా వస్తున్న ప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం లేదని  బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో ఈ మొత్తాన్ని కూడా రైతుల నుంచే బ్యాం కులు రాబట్టే యత్నం చేస్తున్నాయి. ఫలి తంగా రైతులపై అదనపు భారం పడు తోంది.  రైతులు పడుతున్న ఇబ్బందులపై ప్రతిపక్షాలు కూడా పోరుబాట పట్టాయి. ఎక్కడ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నా రైతు రుణమాఫీ విషయాన్ని ప్రస్తా విస్తూ సర్కార్‌ను ఇరకాటంలో పెడుతు న్నాయి. దీంతో టీఆర్‌ఎస్‌ ప్రభు త్వంలో కదలిక వచ్చింది. తొలివిడత రూ. 25వేలలోపు పంట రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం.. దానికి కొనసా గింపుగా రూ.50 వేల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకూ రుణమాఫీ ప్రక్రియ కొనసాగిం చాలని అధికారులను ఆదే శించింది. సర్కార్‌ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో సుమారు 50వేలకు పైగా రైతులు ప్రయోజనం పొందనున్నారు. 


మొత్తం 3.11 లక్షల రైతులు

 ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో సుమారు 3,11,753 మంది రైతులకు రుణమాఫీ వర్తిస్తుందని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో దాదాపు పదిశాతం మందికి మొదటి విడత రుణమాఫీ చేశారు. రెండో విడత దాదాపు 50వేల మందికిపైగా రైతులకు రుణమాఫీ జరగనుందని అధికారులు తెలిపారు. ఆదివారం, సోమవారం సెలవు దినాలు కావడంతో లబ్ధిదారుల సం ఖ్యపై ఇంకా కసరత్తు పూర్తికాలేదని అధికారులు తెలిపారు. 


మొత్తం రుణమాఫీకి అర్హత పొందిన వారు 

( జిల్లాల వారీగా..) 

రంగారెడ్డిజిల్లా 1,47,075

వికారాబాద్‌ జిల్లా 1,58,478

మేడ్చల్‌ జిల్లా 6,200

 

Follow Us on: