రాష్ట్రంలో రాక్షస పాలన

ABN , First Publish Date - 2021-03-02T05:37:56+05:30 IST

లో రాక్షస పాలన సాగుతోందని టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆరోపించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చిత్తూరు పర్యటనకు వెళ్తున్న చంద్రబాబును విమానాశ్ర

రాష్ట్రంలో రాక్షస పాలన
మాట్లాడుతున్న రవికుమార్‌




చంద్రబాబును అడ్డుకోవడం దారుణం

టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్‌

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, మార్చి 1: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఆరోపించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చిత్తూరు పర్యటనకు వెళ్తున్న చంద్రబాబును విమానాశ్రయంలో అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో గూండాల పాలన సాగుతోందన్నారు. తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆస్తులను ధ్వంసం చేయడం దారుణమని విమర్శించారు. స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందని గుర్తు చేశారు.  పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలన్నారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తే ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు.  టీడీపీ ప్రభుత్వం ఇలానే వ్యవహరించి ఉంటే నాడు జగన్‌ పాదయాత్ర చేయగలిగేవారా అని ప్రశ్నించారు. రూ.3 లక్షల జీతం తీసుకొని చంద్రబాబును విమర్శించే హక్కు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరిచ్చారని నిలదీశారు. ప్రభుత్వ సలహాదారుడిగా ఉంటూ ఆయన చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కాదని ధ్వజమెత్తారు. మంత్రి సీదిరి అప్పలరాజు మిడిసి పడుతున్నారని.. ప్రజాస్వామ్యాన్ని హత్యచేసి నవ్వుతున్నారని విమర్శించారు. పలాస-కాశీబుగ్గ మునిసిపాల్టీలో వైసీపీలో చేరిన టీడీపీ అభ్యర్థులు సనపల హరి, రోణంకి మురళీకృష్ణ, బమ్మిడి వెంకటలక్ష్మి, వాయిలపల్లి లక్ష్మణరావులపై పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందని చెప్పారు. వలంటీర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని..ఆధారాలతో ఫిర్యాదు చేసినా కలెక్టర్‌ చర్యలు తీసుకోలేదని రవికుమార్‌ నిరసన వ్యక్తం చేశారు. సమావేశంలో టీడీపీ నాయకులు ఎం.వెంకటేష్‌ తదితరులు ఉన్నారు.  




Updated Date - 2021-03-02T05:37:56+05:30 IST