సంక్షేమం పేరుతో బీసీలకు తీరని అన్యాయం

ABN , First Publish Date - 2021-06-05T06:05:16+05:30 IST

ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీలకు తీరని ద్రోహం చేశారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అన్నారు.

సంక్షేమం పేరుతో బీసీలకు తీరని అన్యాయం
గుండుమల తిప్పేస్వామి

- టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి 

మడకశిరటౌన, జూన 4: ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీలకు తీరని ద్రోహం చేశారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అన్నారు. శుక్రవారం బాలాజీ నగర్‌లోని ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. సంక్షేమం పేరుతో జగనరెడ్డి బడుగులను వంచన చేశారన్నారు. కార్పొరేషనలను నిర్వీర్యం చేసి సబ్‌ప్లాన నాశనం చేసి నవరత్నాలతో హడావుడి చేయడం మోసం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామంటూ హడావుడి చేస్తూ ఆకార్పొరేషన్లకు కేటాయించిన నిధులు, కార్పొరేషన కార్యాలయాల అడ్ర్‌సలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. నాయిబ్రాహ్మణులకు, రజకులకు, టైలర్‌లకు, మత్స్యకారులకు తీరని ద్రోహం చేశారన్నారు. తెలుగుదేశంపార్టీ హయాంలోనే రజక, బోయ వంటి వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించారన్నారు. ముఖ్యమంత్రిగా జగనమోహనరెడ్డి అధికారం చేపట్టాక బీసీలపై వేదింపులు పెరిగాయని, బీసీలే లక్ష్యంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుండటం నిజం కాదా అంటూ ప్రశ్నించారు. కాపు సంక్షేమం కోసం కాపునేస్తం పేరుతో కాపులను మోసం చేశారన్నారు. ఇలా అన్ని వర్గాలను మోసం చేస్తూ ప్రకటనలకే పరిమితం అవుతున్నారని, మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలను 94 శాతం అమలు చేశామంటూ గొప్పలు చెప్పుకొంటున్నారేకానీ క్షేత్రస్థాయిలో అమలయింది శూన్యం అన్నారు. 



Updated Date - 2021-06-05T06:05:16+05:30 IST