బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

ABN , First Publish Date - 2021-07-24T04:40:28+05:30 IST

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న జనార్ధన్‌రెడ్డి

  • చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జనార్ధన్‌రెడ్డి 

షాబాద్‌: బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని, రాష్ట్రంలో అమలవుతున్న ప్రజావ్యతిరేక విధానాలతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పతనమై, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి బెక్కరి జనార్ధన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం షాబాద్‌ మండల కేంద్రంలో పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కంజర్ల ప్రకాష్‌, మండల అధ్యక్షుడు లంబడి కిరణ్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి హాజరై ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. బీజేపీని గ్రామస్థాయిలో బలోపేతం చేసేందుకు సైనికుల్లా కృషిచేయాలని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అరాచకాలను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు బీజేపీ ముందుంటుందన్నారు. కేంద్రప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మ పథకాల అమలులో కేంద్రప్రభుత్వం వాటా ఉంటుందని ప్రజలకు వివరించాలన్నారు. 2019లో గెలిచిన సర్పంచులకు గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, కేసీఆర్‌ కుటుంబంలో అందరూ ఉద్యోగాలు సంపాదించుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవడం కేసీఆర్‌ కుటుంబానికి ఆనవాయితీగా మారిందన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఘనవిజయం సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల ఇన్‌చార్జి భూపాలచారి, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా ఉపాఽధ్యక్షులు రాము, కిసాన్‌ మోర్చా జిల్లా కార్యదర్శి మాణయ్య, నాయకులు రవీందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, మహేందర్‌, రవీందర్‌గౌడ్‌, మహేష్‌, శ్రీశైలం, కార్యకర్తలు పాల్గొన్నారు. 

బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిగా రాజు 

ఆమనగల్లు: బీజేపీ ఓబీసీ మోర్చా ఆమనగల్లు మండల అధ్యక్షుడిగా పోలేపల్లి గ్రామానికి చెందిన వరికుప్పల రాజు నియమితులయ్యారు. ఆమనగల్లులో శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కండె హరిప్రసాద్‌ ఆధ్వర్యంలో నాయకులు సమావేశమయ్యారు. అనంతరం రాజును హరిప్రసాద్‌, పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా నాయకులు వగ్గు ప్రభాకర్‌, మున్సిపల్‌ కన్వీనర్‌ లక్ష్మణ్‌, రాంరెడ్డి, నర్సింహ, చెన్నకేశవులు, శ్రీకాంత్‌సింగ్‌, శ్రీశైలం, రాజు, తదితరులు పాల్గొన్నారు. 

కుంట, నీటికాల్వను కబ్జా చేశారని బీజేపీ ధర్నా

శంషాబాద్‌: శంషాబాద్‌లోని చారినగర్‌ వెళ్లేదారిలో కుంటతో పాటు నీటి కాల్వను కబ్జాచేసి నిర్మాణం చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం బీజేపీ కార్యకర్తలు ధర్నాచేశారు. బీజేపీ కిసాన్‌మోర్చా మున్సిపల్‌ అధ్యక్షుడు ఎం.మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ సర్వేనెంబర్‌ 774 పరిధిలోని బోయినికుంట పూర్తిగా ఆనవాళ్లు లేకుండా కనుమరుగైందన్నారు. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతుంటే అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నందకిషోర్‌, దేవేందర్‌, వంశీ, శ్రీధర్‌, శ్రీను, మోహన్‌, రమేష్‌, అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-24T04:40:28+05:30 IST