మసాలా దినుసులతో జాగ్రత్త!

Published: Thu, 04 Mar 2021 12:05:35 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మసాలా దినుసులతో జాగ్రత్త!

ఆంధ్రజ్యోతి(04-03-2021)

జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి మసాలా దినుసులు బాగా పనిచేస్తాయి. కానీ వాటిని ఎక్కువ మొత్తంలో ఖాళీ కడుపుతో తీసుకుంటే మాత్రం జీర్ణసంబంధమైన సమస్యలు తలెత్తుతాయని అంటున్నాను నిపుణులు.


దాల్చినచెక్క: దాల్చినచెక్కను ఎక్కువగా ఉపయోగించడం వల్ల సినామల్‌డిహైడ్‌ అనే అలర్జీ వస్తుంది. ఈ అలర్జీ వల్ల నోట్లో పుండ్లు ఏర్పడడంతోపాటు తెల్లమచ్చలు వస్తాయి. నోటి లోపలి భాగంలో దురద వస్తుంది.


నల్లమిరియాలు: వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కొన్ని మందులు  పనిచేయవని పరిశోధనల్లో వెల్లడైంది. అంతేకాదు వీటి వినియోగం వల్ల  కొన్ని మందులు వాడినపుడు రియాక్షన్స్‌ తలెత్తి అలర్జీలు వస్తాయని రుజువయింది.


పాప్రికా: ఖాళీ కడుపుతో దీన్ని తీసుకుంటే స్టమక్‌ ఫ్లూ రిస్కు ఉంటుంది. పొత్త్తికడుపులో నొప్పితో బాధపడతారు. కడుపులో మంటగా ఉంటుంది. ఉదయాన తీసుకునే సలాడ్‌లో  కూడా ఈ పొడి వేసుకోవద్దు. 


మెంతులు: శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉన్నవాళ్లు మెంతులకు దూరంగా ఉండడం మంచిది. మెంతులు ఎక్కువ తీసుకోవడం వల్ల ఆస్తమా పెరుగుతుంది. గ్యాస్‌ ఎక్కువ కావడం, పొత్తికడుపులో నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.


జీలకర్ర: ఇది జీర్ణక్రియ బాగా జరిగేట్టు చూస్తుంది. అయితే వీటిని ఎక్కువ వాడితే వేడిచేస్తాయి. శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. గుండెలో మంట వస్తుంది. ముఖ్యంగా వేసవికాలంలో వీటిని తక్కువగా ఉపయోగించాలి.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.