పాఠశాలను విలీనం చేయవద్దు

Published: Thu, 20 Jan 2022 23:55:21 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 పాఠశాలను విలీనం చేయవద్దుఎంపీడీవోకు వినతిపత్రం అందజేస్తున్న గ్రామస్థులు


 మహంతిపాలెం గ్రామస్థుల ఆందోళన  
రణస్థలం:
మండలంలోని మహంతిపాలెం యూపీ స్కూల్‌ను గొర్లెపేట హైస్కూల్‌లో విలీనం చేయవద్దంటూ మహంతిపాలెం గ్రామస్థులు గురువా రం ఎంపీడీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.  ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న తమ పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించామ న్నారు. ఇప్పుడు 3 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న 130 మంది విద్యా ర్థులను సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని గొర్లెపేట హైస్కూల్‌కు పంపించడం తగదని తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఈ ఆలోచనను ప్రభుత్వం మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. అంతవరకు తమ పిల్లలను పాఠశాలకు పంపించమన్నారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.