దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-09-22T06:42:18+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని గుండ్లపోచంపల్లి చైర్‌పర్సన్‌ మద్దుల లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి

గుండ్లపోచంపల్లి చైర్‌పర్సన్‌ మద్దుల లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి


మేడ్చల్‌: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని గుండ్లపోచంపల్లి చైర్‌పర్సన్‌ మద్దుల లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మున్సిపల్‌ పరిధిలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో అక్షయపాత్ర ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థ సహకారంతో 740 మంది విద్యార్థులకు కిట్లు అందజేశారు. అంతకుముందు 11వ వార్డులో రూ.15లక్షలతో నిర్మించనున్న అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులను చైర్‌పర్సన్‌ ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో కమిషనర్‌ అమరేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, కౌన్సిలర్‌లు జైపాల్‌రెడ్డి, పెంటయ్య, వీణాసురేందర్‌గౌడ్‌, బాలరాజు, హేమంత్‌రెడ్డి, మల్లిఖార్జున్‌, సాయిపేట శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మున్సిపల్‌ అధ్యక్షుడు సంజీవగౌడ్‌, వర్కింగ్‌ ప్రసిడెంట్‌ నరేందర్‌రెడ్డి, డీఈ చిరంజీవులు, కోఆప్షన్‌ సభ్యుడు దేవేందర్‌, నాయకులు జనార్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-22T06:42:18+05:30 IST