రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీల పెంపు దారుణం

ABN , First Publish Date - 2021-10-18T05:59:35+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలను దారుణంగా పెంచుతూ సామాన్యులపై అధిక భారం మోపుతుందని టీడీపీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి అయితాబత్తుల ఆనందరావు ఆరోపిం చారు.

రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీల పెంపు దారుణం

అమలాపురం రూరల్‌, అక్టోబరు 17: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలను దారుణంగా పెంచుతూ సామాన్యులపై అధిక భారం మోపుతుందని టీడీపీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి అయితాబత్తుల ఆనందరావు ఆరోపిం చారు. రెండున్నరేళ్లలోనే  ఆరు పర్యాయాలు విద్యుత్‌ చార్జీలు పెంచిన ఘనత జగన్‌ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. త్వరలోనే ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అమలాపురం టీడీపీ కార్యాలయంలో ఆదివా రం మండలశాఖ అధ్యక్షుడు మల్లుల పోలయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వక్తలు మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటు పడిందని ధ్వజమెత్తారు. మాజీ ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి మంద గెద్దయ్య, ఎంపీటీసీ నేదునూరి నాగరత్నం, పిచ్చిక శ్యామ్‌, బళ్ల శ్రీనివాసచక్రవర్తి, రంకిరెడ్డి అబ్బులు, ముదునూరి చంటి రాజు, కాశిన బాబి, కాట్రు కృష్ణ, నడింపల్లి ఉదయబాబు, మాడా మాధవి, మండలీక సుబ్రహ్మణ్యశర్మ, నేదునూరి నతానియేలు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-18T05:59:35+05:30 IST