Advertisement

ఎల్బీ స్టేడియంలో బహిరంగసభకు తరలిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు

Nov 28 2020 @ 23:54PM
సభకు తరలివెళ్తున్న కీసర నాయకులు

కీసర రూరల్‌/మేడ్చల్‌రూరల్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని ఎల్బీ స్టేడియంలో టీఆర్‌ఎస్‌ పార్టీ శనివారం నిర్వహించిన బహిరంగ సభకు నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీకి చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా దమ్మాయిగూడ మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ మంగళపురి వెంకటేశ్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా  మేడ్చల్‌ టీఆర్‌ఎస్‌ నేతలు శనివారం సాయంత్రం ఎల్‌బీనగర్‌ స్టేడియంలో నిర్వహించిన సీఎం కేసీఆర్‌ సభకు పెద్దఎత్తున తరలివెళ్లారు.

Follow Us on:
Advertisement