నారాయణపురం తాండా వద్ద ఏనుగుల మంద

ABN , First Publish Date - 2022-10-01T05:23:21+05:30 IST

రామకుప్పం మండలంలోని అటవీ సమీప గ్రామాల ప్రజలను ఏనుగులు భయాందోళనకు గురిచేస్తున్నాయి.

నారాయణపురం తాండా వద్ద ఏనుగుల మంద
నారాయణపురంతాండా వద్ద ఏనుగులు

రామకుప్పం, సెప్టెంబరు 30: మండలంలోని అటవీ సమీప గ్రామాల ప్రజలను ఏనుగులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఏడు ఏనుగుల మంద  రెండు రోజులుగా సింగసముద్రం, జీడిమాకులపల్లెల సమీప పంటపొలాలను ధ్వంసం చేశాయి. అటవీశాఖ అధికారులు, సిబ్బంది వాటిని గురువారం రాత్రి ట్రాకర్స్‌ సాయంతో అటవీ లోతట్టు ప్రాంతానికి తరిమారు. అవి తిరిగి శుక్రవారం సాయంత్రం చీకటి పడగానే  రామకుప్పం- 89పెద్దూరు రహదారి దాటి నారాయణపురం తాండా సమీప పొలాల్లో హల్‌చల్‌ చేశాయి.  రైతు కుమార్‌నాయక్‌కు చెందిన వరి పొలంలో పైరును ధ్వంసం చశాయి. ప్రజలు ఎక్కడకు వెళ్ళినా చీకటి పడకముందే  గ్రామాలకు చేరుకోవాలని, రైతులెవరూ రాత్రిపూట పొలాల వద్దకు వెళ్లవద్దంటూ అటవీ శాఖ అధికారులు సూచించారు. 

Updated Date - 2022-10-01T05:23:21+05:30 IST