ఎస్సీ రిజర్వేషన్ల సాధనకు ఉద్యమించాలి

ABN , First Publish Date - 2021-06-23T04:35:47+05:30 IST

ఎస్సీ రిజర్వేషన్ల సాధన దిశగా ఉద్యమించాలని,

ఎస్సీ రిజర్వేషన్ల సాధనకు ఉద్యమించాలి
సమావేశంలో మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ

  • ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ


శామీర్‌పేట : ఎస్సీ రిజర్వేషన్ల సాధన దిశగా ఉద్యమించాలని, అందులోభాగంగా జూలై 7 నుంచి 27 వరకు ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామ గ్రామాన జెండాలను ఎగురవే యాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు నిచ్చారు. మంగళవారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా తూం కుంట మున్సిపాలిటీ పరిధిలోని మొగుళ్ళ వెంకట్‌రెడ్డి గార్డెన్స్‌లో ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అధ్యక్షతన నిర్వహించిన ఎమ్మార్పీఎస్‌ జాతీయస్థాయి సమావేశానికి మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్లు సాధించుకునే దిశగా ప్రతిఒక్కరూ పాటుపడాలని, సామాజిక లక్ష్యమే ధ్యేయంగా రెండు రాష్ర్టాల్లో జరుగుతున్న రాజకీయ భవిష్యత్తుపై ఆయా రాష్ర్టాల నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో లాయర్స్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు విశ్వనాథ్‌, దివ్యాంగుల అనుబంధ సంస్థల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు గోపాల్‌, జాతీయ కళామండలి అధ్యక్షులు ఎన్‌వై అశోక్‌మాదిగ, జిల్లా ఇన్‌చార్జి రాంచందర్‌, జిల్లా నాయకులు శంకర్‌, బచ్చలకూర స్వామి, ఎమ్మా ర్పీఎస్‌ మూడుచింతలపిల్లి మండల అధ్యక్షుడు నల్ల కృష్ణమాదిగ, శామీర్‌పేట మండల ఇన్‌చార్జి, నాయ కులు కుమార్‌, మేడి చిన్నస్వామి, చంద్రశేఖర్‌, దుర్గేష్‌, ప్రవీణ్‌, మహేందర్‌, తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-06-23T04:35:47+05:30 IST