ఇంజనీరింగ్‌ కళాశాల పరిశీలన

ABN , First Publish Date - 2021-05-11T05:11:07+05:30 IST

ఇంజనీరింగ్‌ కళాశాల పరిశీలన

ఇంజనీరింగ్‌ కళాశాల పరిశీలన

ఘట్‌కేసర్‌: మండల పరిధిలోని చౌడరిగూడ పంచాయతీలో గల నల్ల నర్సింహారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలను సోమవారం మేడ్చల్‌ జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి పరిశీలించారు.  కాగా ఇటీవల కళాశాల యాజమాన్యం ప్రహరీ నిర్మాణం కోసం అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. కళాశాల పక్క నుంచి మూసీ కాలువ ఉండటంతో ఆయా శాఖల అధికారులు పరిశీలించి అనుమతులు జారీ చేయాలి, కాని అధికారులు ఆలస్యం చేయడంతో కళాశాల యాజమాన్యం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. దీంతో సోమవారం పంచాయతీ అధికారి పద్మజారాణి, సాగునీటి శాఖ డీఈ పరమేశ్వర్‌రెడ్డి, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్టు డిప్యూటీ డైరక్టర్‌ మహేష్‌, స్థానిక సర్పంచ్‌ రమాదేవి, తదితరులు పరిశీలించారు. 

Updated Date - 2021-05-11T05:11:07+05:30 IST