ప్రశ్నిస్తే అరెస్టులు...అడ్డుకుంటే జైళ్లు..!

Nov 29 2021 @ 00:00AM

అంతా వారి ఇష్టమే..!

ప్రజా సమస్యల పోరుపై ఉక్కుపాదం

అనుమతులివ్వరు... ఆందోళన చేస్తే తట్టుకోలేరు

వివాదాస్పదమవుతున్న పోలీసు అధికారుల తీరు

అనంతపురం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): 

జిల్లాలో కొందరు పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు రోజురోజుకు వివాదాస్పదమవుతోంది. ప్రజా సమస్యలపై గొంతెత్తే విపక్షాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ విమర్శలు విపక్షాల నుంచేకాదు మేధావి వర్గాలు, రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తాం. ఆందోళనలు, నిరసనలు చేసినా  పాలకులను అడ్డుకున్నా జైళ్లకు పంపుతామనే సంకేతాలను పంపుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పాలకులు జిల్లాకొ చ్చిన సందర్భాల్లో విపక్షాలు, ప్రజా, ఉద్యోగ, కార్మిక, కర్షక సంఘాలు వారి వారి సమస్యలను ఏకరువు పెట్టి, పరిష్కారం చూపాలని వివిధ రూపాల్లో విన్నవించుకోవడం సర్వసాధారణం. మరెందుకోగానీ... జిల్లాలో విపక్షాలు, ప్రజా సంఘాలకు ప్రతిసారీ చేదు అనుభవం ఎదురవుతోంది. అనుమతి లేదన్న ధోరణితో పోలీసులు వ్యవహరిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాలక పార్టీ మంత్రులు జిల్లాకొచ్చిన సందర్భంలో విపక్షాలు గానీ, ప్రజాసంఘాలు గానీ తమ సమస్యలను విన్నవించుకునేందుకు పోలీసులే అనుమతి ఇస్తే ఈ పరిస్థితులు ఉండేవి కాదన్నది నిర్వివాదాంశం. సమస్యలు విన్నవించుకునేందుకు అనుమతివ్వాలని ఆ వర్గాలు కోరినా ఇవ్వడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. రా జ్యాంగం కల్పించిన హక్కుల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే విపక్షాలు మొదలుకొని ప్రజాసంఘాలు సైతం పోలీసులను అనుమతి కోరినా నిరాకరణే ఎదురవుతోంది. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే కోణంలో పోలీసు అధికారులు ఆలోచించినట్లయితే అనుమతులిప్పించి సమస్యలను పాలకుల ముందు విన్నవించుకునే చొరవ చూపాల్సిన బాధ్యత వారిపైనే  ఉంటుందనే అభిప్రాయం ఆ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. పోలీసు అధికారులు ఎప్పుడైతే నిరాకరణ పేరుతో నెట్టివే స్తున్నారో అప్పుడే సమస్య జటలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ము ఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సరికొత్త పోకడలకు తెరతీశారనే వాదన బలంగా వినిపిస్తోంది. పాలకులను గానీ... పాలక పార్టీ ప్రజాప్రతినిధులను విమర్శించినా... వేధింపులకు గురిచేసే పరిస్థితులు జిల్లాలో ఉన్నాయనేందుకు గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఘటనలే నిదర్శనం. ఈ క్రమంలో పాలకేతర పార్టీ నాయకులనే కాదు.. నాయకురాళ్లను కూడా వదలడం లేదు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలా..? లేదా స్థానిక అధికార పార్టీ నాయకుల సూ చనలతోనే  పోలీసు అధికారులు ఆ విధంగా వ్యవహరిస్తున్నారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతుండటం గమనార్హం.  పోలీసు అధికారుల వివాదాస్పద తీరుకు అద్దం పట్టే సంఘటనలు మచ్చుకు కొన్ని..

- ఎయిడెడ్‌ కళాశాలను ప్రైవేట్‌పరం చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో... ఎస్‌ఎ్‌సబీఎన కళాశాలను ఎయిడెడ్‌గానే ఉంచాలని సీపీఐ అనుబంధ ఏఐఎ్‌సఎఫ్‌, ఏఐవైఎఫ్‌, టీడీపీఅనుబంధ విద్యార్థి సంఘం టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకులు ఆ కళాశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి శాంతియుతంగా ఆందోళన చేపట్టారు. ఆ సందర్భంలో విద్యార్థి సంఘాల నాయకులతో పాటు విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. లాఠీలతో విద్యార్థులపై దాడి చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకే్‌షబాబుతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు తీవ్ర స్థాయిలో స్పందించడంతో పాటు బాధిత విద్యార్థులతో మాట్లాడటం తెలిసిందే. ఆ ఘటనలో ఎవరైతే విద్యార్థి సంఘాల నాయకులు భాగస్వాములయ్యారో పోలీసులు వారిని అరెస్టు చేసి రాత్రి వరకూ స్టేషనలోనే బంధించారు. ఈ వివాదంలో సబ్‌ డివిజన అధికారితో పాటు మరికొందరు సీఐలు, ఎస్‌ఐలపై బాధిత వర్గాల నుంచి ఆక్రోశం వ్యక్తమైంది. చివరికి కళాశాల యాజమాన్యమే దిగొచ్చి ఎయిడెడ్‌గానే ఉంచుతున్నట్లు ప్రకటించడంతో ఆ సమస్య సద్దుమణిగింది. 


- అసెంబ్లీలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేసిన నేపథ్యంలో... చంద్రబాబు కంటతడి పెట్టిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాకు చెందిన కొందరు టీడీపీ మహిళా నాయకురాళ్లు బాధ, ఆవేదనతో అధికార పార్టీ పెద్దలపై వ్యక్తిగత విమర్శలు చేశారు. వాటిపై ఎవరి ఆదేశాల మేరకోగానీ... ఆ మహిళా నాయకురాళ్లను స్టేషనకు పిలిపించి విచారించ డంతో సరిపెట్టక వారి ఇళ్లపై సోదాలు చేసి భయాం దోళనలు రేకెత్తేలా వ్యవహరించారు. ఈ క్రమంలో ఓ మహిళా నాయకురాలు ఆత్మహత్యకు యత్నించింది. పోలీసు అధికారుల వేధింపులు తాళలేకే తాను ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె స్పష్టంగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో పోలీసు అధికారులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 


- శనివారం జిల్లాకొచ్చిన జిల్లా ఇనచార్జ్‌ మంత్రికి సమస్యలను చెప్పేందుకు సీపీఐ అనుబంధ సంఘాల నాయకులు కలెక్టరేట్‌ వద్దకు వచ్చిన సందర్భంలో మంత్రిని కలిసేందుకు పోలీసులు వారిని నిరాకరించారు.  జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థుల అవస్థలను మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని అక్కడే వేచి ఉన్నారు. మంత్రి బొత్స   అధికారులతో సమీక్షా సమావేశం ముగించుకొని వాహనంలో బయటకు రాగానే... సీబీఐ అనుబంధ సంఘాల నాయకులు ఆయన వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసు అధికారులు ఆవేశానికి లోనైనట్లు  క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకోకుండా బలవంతంగా వారిని అక్కడి నుంచి అరెస్టు చేసి స్టేషనకు తరలించారు. అంతటితో పోలీసు అధికారులు శాంతించలేదు. వారిపై నాన బెయిలబుల్‌ కేసులు నమోదు చేసి జైలుకు పంపే విధంగా వ్యవహరించారన్న విమర్శలను బాధిత వర్గాల నుంచి పోలీసు అధికారులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులు మనోహర్‌, చిరంజీవి, రాజేంద్ర, ఏఐవైఎఫ్‌ నాయకులు సంతోష్‌, ఆనంద్‌తో పాటు మరో నలుగురు గుత్తి సబ్‌ జైలులో ఉన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.