బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2020-12-03T05:34:15+05:30 IST

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), డిసెంబరు 2: ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులను ఆదుకోవడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. సముద్రంలో వేటకు వెళ్లి నివర్‌ తుఫాన్‌లో చిక్కుకుని ఒమ్మిడి సతీష్‌ అనే మత్స్యకారు

బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
సతీష్‌ కుటుంబాన్ని పరామర్శిస్తున్న కొండబాబు

మాజీ ఎమ్మెల్యే కొండబాబు 

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), డిసెంబరు 2: ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులను ఆదుకోవడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. సముద్రంలో వేటకు వెళ్లి నివర్‌ తుఫాన్‌లో చిక్కుకుని ఒమ్మిడి సతీష్‌ అనే మత్స్యకారుడు మృతి చెందడంతో దుమ్ములపేటలో బుధవారం కుటుంబ సభ్యులను వనమాడి పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ దుమ్ములపేటకు చెందిన మత్స్యకారులు నివర్‌ తుఫాన్‌లో చిక్కుకుని ఐదురోజుల తర్వాత ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చేరుకోగా అప్పటికే బోటులోని ఒమ్మిడి సతీష్‌ మృతిచెందాడన్నారు. టీడీపీ హయాంలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు చంద్రన్న బీమా ద్వారా ఆదుకునేవారమని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడం దారుణమన్నారు. సతీష్‌ బంధువు వాసుపల్లి సత్తిబాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ అధికారి కూడా తమ వద్దకు రాలేదని, మత్స్యకారులకు చాలా అన్యాయం జరుగుతోందని వాపోయారు. ఎరుపల్లి రాము, మూగు రాజు, చోడిపల్లి సతీష్‌, గదుల సాయిబాబు, తుమ్మల రమేష్‌, వొమ్మి బాలాజీ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-03T05:34:15+05:30 IST