గ్రామాల్లో కంటి వైద్య శిబిరాలు

ABN , First Publish Date - 2021-08-03T05:27:33+05:30 IST

కంటి పరీక్షలపై ‘ఆంధ్రజ్యోతి’లో సోమవారం ప్రచురితమైన ‘కంటి వెలుగు ఏదీ?’ అనే కథనంపై జిల్లా యంత్రాంగం స్పందించారు. గ్రామాల్లో వైఎస్‌ఆర్‌ కంటి వెలుగులో భాగంగా 60 ఏళ్లు దాటిన వృద్ధులకు కంటి పరీక్షలను నిర్వహించారు.

గ్రామాల్లో కంటి వైద్య శిబిరాలు
కంటి పరీక్ష చేస్తున్న వైద్యుడు

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

నరసన్నపేట, ఆగస్టు 2: కంటి పరీక్షలపై ‘ఆంధ్రజ్యోతి’లో సోమవారం ప్రచురితమైన ‘కంటి వెలుగు ఏదీ?’ అనే కథనంపై జిల్లా యంత్రాంగం స్పందించారు. గ్రామాల్లో వైఎస్‌ఆర్‌ కంటి వెలుగులో భాగంగా 60 ఏళ్లు దాటిన వృద్ధులకు కంటి పరీక్షలను నిర్వహించారు. జమ్ము గ్రామంలో కంటి వైద్య నిపుణుడు రాజు నేతృత్వంలో 120 మందికి  పరీక్షలు చేశారు. గ్రామాల్లో కంటి వైద్యశిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా అంధత్వ నివారణ సంస్ధ ఆధ్వర్యంలో కళ్లజోళ్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. 

 

Updated Date - 2021-08-03T05:27:33+05:30 IST