
ఆంధ్రజ్యోతి(20-11-2021)
చలికాలంలో తేమశాతం తగ్గిపోతుంది. ఫలితంగా చర్మం పొడి బారిపోతుంటుంది. ఈ సమయంలో సరైన ఫేస్‌ప్యాక్‌ను ఉపయోగిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఎలాంటి ప్యాక్ ఉపయోగించాలంటే...
ఒక బౌల్లో అర టీస్పూన్ తేనె తీసుకుని అందులో కోడిగుడ్డు పచ్చసొన, ఒక టీస్పూన్ పాల పొడి వేసి పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ పేస్టును ముఖానికి పట్టించి, ఇరవై నిమిషాల తరువాత నీళ్లతో కడిగేసుకోవాలి.
ఒకవేళ మీది ఆయిల్ స్కిన్ అయితే అర టీస్పూన్ తేనెలో కోడిగుడ్డు తెల్లసొన, ఒక టీస్పూన్ పెరుగు, కొద్దిగా ముల్తానీ మట్టి వేసి అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చలికాలంలో చర్మం పొడిబారే సమస్యను తగ్గించుకోవచ్చు.