వడ్డీ కట్టించుకుని రైతు రుణాలు రెన్యువల్‌ చేయాలి

ABN , First Publish Date - 2021-04-23T06:51:14+05:30 IST

కరోనా కష్టకాలంలో బ్యాంకు రుణాల రె న్యువల్‌కు అధికారులు వడ్డీ మాత్రమే కట్టించుకోవాలని మండల రైతులు డిమాండ్‌ చేశారు.

వడ్డీ కట్టించుకుని రైతు రుణాలు రెన్యువల్‌ చేయాలి
వేపులపర్తి బ్యాంకు మేనేజర్‌కు వినతిపత్రం ఇస్తున్న రైతులు

బహ్మసముద్రం, ఏప్రిల్‌  22: కరోనా కష్టకాలంలో బ్యాంకు రుణాల రె న్యువల్‌కు అధికారులు వడ్డీ మాత్రమే కట్టించుకోవాలని మండల రైతులు డిమాండ్‌ చేశారు. గురువారం మండలంలోని వేపులపర్తి యూనియన బ్యాంకు ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడు తూ అసలు, వడ్డీ మొత్తం చెల్లించి రుణాలు రెన్యువల్‌ చేసుకోవాలని బ్యాంకు అధికారులు చెప్పడం సరికాదన్నారు. తీవ్రనష్టాల్లో ఉన్న రైతులకు మరింత భారమవుతుందన్నారు. వడ్డీ వ్యాపారులు, దళారులు రైతులను దోచుకుంటారని, వడ్డీ మాత్రమే తీసుకుని రెన్యువల్‌ చేసుకోవాలన్నారు. అ నంతరం బ్యాంకు మేనేజర్‌ మల్లికార్జునకు వినతిపత్రం అందజేశారు. స మస్యను ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళతామని మేనేజర్‌ తెలిపారు. 


కుందుర్పి: మండలంలోని రైతులు పంట రుణాల రెన్యువల్‌ కోసం నా నా కష్టాలు పడుతున్నారని, ఈతరుణంలో అసలు లేకుండా వడ్డీ మాత్ర మే కట్టించుకుని రైతులకు సహకరించాలని మండల సర్పంచులు కోరారు. ఈమేరకు గురువారం స్థానిక కెనరాబ్యాంకు మేనేజర్‌ అర్చనకు మండలం లోని సర్పంచులు వినతిపత్రాన్ని అందజేశారు. బ్యాంకు మేనేజర్‌ స్పంది స్తూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. కార్యక్రమం లో సర్పంచులు ప్రభాకర్‌, రామ్మూర్తి, మల్లికార్జున, అతావుల్లా, వన్నూర్‌రెడ్డి, జగన, రైతు సంఘం నాయకుడు ఓబులేష్‌లు పాల్గొన్నారు. 


శెట్టూరు: రైతులు పంట రుణాలను ఈనెల 26 నుంచి రెన్యువల్‌ చేసుకోవాలని స్థానిక ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ లోకేష్‌ గురువా రం ఒక ప్రకటన లో కోరారు. రుణాలను సకాలంలో రెన్యువల్‌ చేసుకోవడం వల్ల వడ్డీ రాయితీ లభిస్తుందన్నారు. జాబితాను ఆయా గ్రామాల్లో ప్రదర్శించామని, ఆమేరకు రెన్యువల్‌ కోసం బ్యాంకు వద్దకు రావాలన్నారు.


Updated Date - 2021-04-23T06:51:14+05:30 IST