వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించిన ఎఫ్‌డీసీ చైర్మన్‌

ABN , First Publish Date - 2021-05-09T04:50:50+05:30 IST

తూప్రాన్‌ పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌తో కలిసి ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి పరిశీలించారు.

వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించిన ఎఫ్‌డీసీ చైర్మన్‌

తూప్రాన్‌, మే 8: తూప్రాన్‌ పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌తో కలిసి ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్లు, అధికారులు కరోనా కట్టడికి కృషి చేస్తున్నారన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో బృందాలు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నట్లు ప్రతా్‌పరెడ్డి పేర్కొన్నారు. లక్షణాలు ఉంటే సమాచారం ఇవ్వకుండా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, ఆలస్యంగా వస్తే ప్రయోజనం ఉండదన్నారు. వ్యాక్సిన్‌ తీసుకునే వారికి టోకెన్లు అందజేయాలని సూపరింటెండెంట్‌ అమర్‌సింగ్‌కు సూచించారు. ఆయనవెంట కౌన్సిలర్లు, నాయకులు రఘుపతి, ప్రభాకర్‌రెడ్డి, ఉపేందర్‌, అశోక్‌, అచ్యుత్‌రెడ్డి ఉన్నారు.


Updated Date - 2021-05-09T04:50:50+05:30 IST