పాఠశాలల్లో భయం.. భయం

ABN , First Publish Date - 2021-04-18T06:14:55+05:30 IST

కరోనా సెకెండ్‌ వేవ్‌ కల్లోలం సృష్టిస్తోంది. ఈనేపథ్యంలో హిందూపురంలో కొవిడ్‌ పరీక్షల కోసం జనం పరుగులు పెడుతూ పడిగాపులు కాస్తున్నారు.

పాఠశాలల్లో భయం.. భయం
ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కొవిడ్‌ నిర్థారణ పరీక్షల కోసం పడిగాపులు

-ఫవణికిస్తున్న కరోనా సెకండ్‌ వేవ్‌

-నిర్ధారణ పరీక్షలకు తప్పని తిప్పలు

హిందూపురం, ఏప్రిల్‌ 17: కరోనా సెకెండ్‌ వేవ్‌ కల్లోలం సృష్టిస్తోంది. ఈనేపథ్యంలో హిందూపురంలో కొవిడ్‌ పరీక్షల కోసం జనం పరుగులు పెడుతూ పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం కొవిడ్‌ పరీక్షలు నిర్థారణలో వేగం వంతం చేస్తున్నామని చెబుతున్నా హిందూపురం ఆసుపత్రి వద్ద మాత్రం ప్రతిరోజు కరోనా నిర్థారణ పరీక్ష కేంద్రం వద్ద పడిగాపులు కాయాల్సివస్తోంది. శనివారం పట్టణంతోపాటు పలు పాఠశాల, కళాశాల్లో విద్యార్థుల, ఉపాద్యాయులకు కరోనా సోకడంతో ప్రభుత్వం, ప్రైవేట్‌ పాఠశాల, కళాశాల్లో ఆందోళన కల్గించింది. ఈనేపథ్యంలో శనివారం కరోనా లక్షణాలతో పట్టణ వాసులతోపాటు పలు పాఠశాల, కళాశాల విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రి కొవిడ్‌ నిర్థారణ పరీక్ష కేంద్రం వద్ద పడిగాలు కాశారు. అయితే పరీక్ష కేంద్రానికి వైద్యుల రాక ఆలస్యంతోపాటు పరిమిత సంఖ్యలో పరీక్షలు చేపట్టారు. దీందో ఉదయం నుంచి కొవిడ్‌ కేంద్రం వద్ద నిర్థారణ పరీక్షల కోసం వచ్చిన వారు ఆందోళన చెందారు. ఆసుపత్రి అత్యవసర విభాగం వద్ద కొవిడ్‌ పరీక్ష నిర్థారణ కేంద్రం ఏర్పాటు పైగా ఓ అటెండర్‌ అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై పరీక్షల కోసం వచ్చిన వారు ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షల కోసం వచ్చిన వారందరికి పరీక్షలు చేపట్టామని ప్రభుత్వ వైద్యులు చెబుతున్నా పరీక్షల కోసం వచ్చిన వారు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడాల్సివచ్చింది. 

విజృంభిస్తున్న కేసులు: ఇలా ఉంటే  హిందూపురంలో బ్రిడ్జి స్కూల్‌లో ముగ్గురు ఐదు రోజుల కిందట ముగ్గురు విద్యార్థినులతోపాటు ఓ ఉపాధ్యాయురాలికి కరోన పాజిటివ్‌ నిర్థారణతో ఆందోళన కల్గించింది. ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ విద్యార్థుల్లో లక్షణాలున్నా వారందికి పరీక్షలు చేపట్టారు. అదే విధంగా పట్టణంలో ప్రభుత్వ మహిళ డీగ్రీ కళాశాలో ముగ్గురికి, కిరెకెర వద్ద ఉన్న ప్రైవేట్‌ పాఠశాలలో విద్యార్థీనీతోపాటు ఉపాధ్యాయురాలికి కొవిడ్‌ బారిన పడ్డారు. పట్టణంలో మేళాపురంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుని పాజిటివ్‌ నిర్థారణతో విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది. అదే విధంగా హిందూపురం, చిలమత్తూరులో 2 సడ్డపల్లి, గోరంట్ల, పెనుకొండ, గుడిబండలో రోళ్ళలో కలిపి 36 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

 పలు పాఠశాలల్లో కరోనా కేసులు వెలుగుచూడడంతో విద్యార్ధులకు కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు చేయించుకుంటే హాజరుకావాలని చెప్పడంతో విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది. ఈనేపథ్యంలో కొవిడ్‌ నిర్థారణ కేంద్రం వద్దకు పరుగులు పెడుతున్నారు. హిందూపురం పట్టణంలో కొవిడ్‌ పరీక్ష కేంద్రాలు పెంచాలని పట్టణ వాసులు డిమాండ్‌ చేస్తున్నారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గురువారం 200 మంది కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు చేపట్టారంటే కరోనా సెకెండ్‌ వేవ్‌ ఏ మేరకు విజృంభణ చేస్తోందో ఆందోళన కలిగిస్తోంది. 


Updated Date - 2021-04-18T06:14:55+05:30 IST