నత్తనడకన ఫీవర్‌ సర్వే

ABN , First Publish Date - 2021-06-21T06:42:34+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫీవర్‌ సర్వేపై అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు న్నాయి.

నత్తనడకన ఫీవర్‌ సర్వే
ఆశావర్కర్లు మాత్రమే ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్న దృశ్యం

నిబంధనలకు విరుద్ధంగా ప్రక్రియ

పర్యవేక్షించని అధికారులు


డీ హీరేహాళ్‌, జూన 20 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫీవర్‌ సర్వేపై అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు న్నాయి. మండలంలోని పలు గ్రామాలలో ఫీవర్‌ సర్వే తూతూమంత్రంగా సాగుతోంది. గ్రామాలలో ఎక్కడా కూడా వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే ని ర్వహిస్తున్నారన్న దాఖలాలు కనిపించడం లేదు.   పంచాయతీ, వైద్యాధికారులు సంయుక్తంగా గ్రా మాలలో ఇంటింటికీ వెళ్లి ఆయా కుటుంబాలలోని వ్యక్తుల ప్రస్తుత ఆరోగ్య స్థితిగతుల గురించి ప్రతి వారం విడతల వారిగా తెలుసుకోవాలని సర్వే చేపట్టారు. వివరాలను ఆనలైనలో నమోదు చేసి అనంతరం వైద్య సిబ్బంది సలహాలు అందించాల్సి వుంటుంది. కానీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో దీనికి భి న్నంగా సర్వే పనితీరు కనిపిస్తోంది. మండలంలో ఎక్కడా కూడా ఇంటింటి సర్వే చేస్తున్న ఆనవాళ్లు కనిపించడం లేదు. సర్వే నిర్వహించాల్సిన సిబ్బంది ఆఫీసులు, ఇళ్లల్లో కూ ర్చుని కానిచ్చేస్తున్నారు. మండలంలో 13 సచివాలయాలలో 112 మంది స చివాలయ సిబ్బంది, 205 మంది వలంటీర్లు వుండగా, ఈ సర్వే ప్రక్రియ మాత్రం చిత్తశుద్ధి లేకుండా ముగించేస్తున్నారు.


సర్వేలో అక్కడక్కడా వైద్య సిబ్బంది మాత్రమే కనిపిస్తున్నారు. సచివాలయ సిబ్బంది దృష్టి సారించకపోవడంతో సర్వే ప్రక్రియలో నిబద్ధత లేకుండా పోతోంది. దీంతో అవగాహ న లేకుండా గ్రామాలలో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. కాగా సర్వేను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లాల్సిన మండల స్థాయి అధికారి అయిన ఎంపీడీవో నిరంతరం అందుబాటులో లేకపోవడం గమనార్హం. మండలంలో సిబ్బందికి క నీసం అవగాహన సమావేశం కూడా ఏర్పాటు చే యకపోవడం విమర్శలపాలవుతోంది.  పర్యవేక్షించాల్సిన అధికారులే కార్యాలయంలో అందుబాటులో లే కపోతే ఇక ఈ సర్వే పరిస్థితి ఏంటని ప్రజలు వా పోతున్నారు. 


పత్రికల్లో మాత్రమే ఫీవర్‌ సర్వే కనిపిస్తోంది:

 రామాంజనేయులు, దొడఘట్ట

గత రెండు నెలలుగా గ్రామంలో కరోనా తీవ్రం గా వున్నప్పుడు చాలా కుటుంబాల్లోని వ్యక్తులు అనారోగ్యానికి గురికావడం జరిగినది. కానీ గ్రామంలోని స్థితిగతుల గు రించి ఏ అధికారి, వలంటీర్లు గానీ తెలుసుకోవ డం జరగలేదు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న ఫీవర్‌ సర్వే కేవలం పత్రికల్లో చూడటం తప్ప ఇం తవరకు గ్రామంలో కనిపించలేదు. ఏ ఒక్క వలంటీర్‌ కూడా గ్రామంలో పర్యటించి ఫీవర్‌ సర్వే గురించి ఏ ఒక్క కుటుంబానికి అవగాహన కల్పించలేదు. ఇక ఆరోగ్య వివరాలు నమోదు చేసుకోవడంలో తప్పలతడకగా వ్యవహరిస్తున్నారు. అధికారులుస్పందించి సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

Updated Date - 2021-06-21T06:42:34+05:30 IST