‘ఇన్‌స్పైర్‌’కు ఐదుగురు

ABN , First Publish Date - 2022-09-14T06:31:46+05:30 IST

ఢిల్లీలో జాతీయ స్థాయిలో జరగనున్న సైన్సు ప్రాజెక్టుల ప్రదర్శనలో తాము రూపొందించిన నమూనాలను ప్రదర్శించేందుకు ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురు విద్యార్థులు మంగళవారం బయలుదేరి వెళ్లారు.

‘ఇన్‌స్పైర్‌’కు ఐదుగురు

జాతీయ స్థాయి సైన్సు ప్రాజెక్టుల ప్రదర్శనకు ఉమ్మడి జిల్లానుంచి బయలుదేరిన విద్యార్థులు 


పలమనేరు, సెప్టెంబరు 13: ఢిల్లీలో జాతీయ స్థాయిలో జరగనున్న సైన్సు ప్రాజెక్టుల ప్రదర్శనలో తాము రూపొందించిన నమూనాలను ప్రదర్శించేందుకు ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురు విద్యార్థులు మంగళవారం బయలుదేరి వెళ్లారు. బుధ, గురు, శుక్రవారాల్లో ఈ ప్రదర్శన నిర్వహించనున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఐదుగురు ఎంపికైన ఉమ్మడి జిల్లా మనదే కావడం గమనార్హం. విజయవాడలో ఫిబ్రవరిలో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌ పోటీల్లో ఈ ఐదుగురి ప్రాజెక్టులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. ఈ ప్రాజెక్టులు అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైతే.. వారు రూపొందించిన ప్రాజెక్టులకు పేటెంట్‌ రావడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం నుంచి నగదు బహుమతులు, సర్టిఫికెట్లు అందనున్నాయని డీఈవో శ్రీరాం పురుషోత్తం, జిల్లా సైన్సు ఆఫీసర్‌ రమణ తెలిపారు.  జాతీయ స్థాయి ప్రదర్శనలకు ఎంపికైన ప్రాజెక్టుల వివరాలిలా ఉన్నాయి. 


ఫ్రూట్‌ ఫిక్కర్‌ అండ్‌ రేపర్‌ 

రూపకర్త: బి.సాయికీర్తన, పీవీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, వాల్మీకిపురం 

ప్రాజెక్టు ప్రాముఖ్యత: ఎంత పెద్ద చెట్టు నుంచైనా పండ్లను సులభంగా కోయవచ్చు. రేపర్‌ ఉపయోగించి ఆ పండ్లను కీటకాలు, పక్షులు, దోమలు, ఎండనుంచి పాడుకాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా మామిడి, చీనీ, దానిమ్మ, తదితర పంటలు సాగుచేసే రైతులకు ఇది ఉపయోగకరం. 


జి.బ్యాగ్స్‌ ఫర్‌ స్మార్టు ప్రిజర్వేటర్స్‌ 

రూపకర్త: ప్రణయ, ఏఎల్‌ పురం జడ్పీ ఉన్నత పాఠశాల, గుడిపాల మండలం 

ప్రాజెక్టు ప్రాముఖ్యత: కూరగాయలు కుళ్లిపోకుండా జి.బ్యాగుల్లో 10నుంచి 15 రోజుల వరకు నిల్వ చేయవచ్చు. ప్లాస్టిక్‌ కవర్లకు దీనిని ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. జి.బ్యాగ్స్‌  ఏకో ఫ్రెండ్లీగా ఉంటాయి. ఈ బ్యాగుల్లో కూరగాయలే కాకుండా పప్పుదినుసులనూ పురుగులు పట్టకుండా నిల్వ చేసుకోవచ్చు. బ్యాగ్స్‌కు పట్టించగా మిగిలిన పిప్పిని క్రిమిసంహారిణిగా వినియోగించవచ్చు. లేదా ఎరువుగా కూడా వాడవచ్చు. 


బ్యాక్‌ రెస్ట్‌ సైడ్‌ సీటెడ్‌ ఫర్‌ ఉమన్‌ 

రూపకర్త: పడిగల చరణ్‌, జంగంపల్లి జడ్పీహెచ్‌ఎ్‌స, పీలేరు మండలం

ప్రాజెక్టు ప్రాముఖ్యత: ద్విచక్రవాహనంపై చీరలు ధరించి మహిళలు, వయోవృద్ధులు ఒకవైపు కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటుంది. వీరికి అనుకూలంగా ఉండేలా మోటారు సైకిల్‌ వెనుకవైపు కూర్చుని సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా ఈ సీటును రూపొందించారు. 


హైజీనిక్‌ టాయిలెట్‌ 

రూపకర్త: జె.నాగేంద్ర, రేణిగుంట జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల 

ప్రాజెక్టు ప్రాముఖ్యత: మరుగుదొడ్డిలోని సూక్ష్మక్రిములు తరచూ చేరటం వల్ల మనకు హాని చేస్తాయి. దీని కోసం కాలితో పనిచేసే విధంగా ఒక లివర్‌ సిస్టంను తయారుచేశారు. అది టాయిలెట్‌ సీటును చేతితోతాకకుండా లిఫ్టుచేస్తుంది. సీటు కవర్‌ను పైకి ఎత్తవచ్చు. కవర్‌ను మూసిన తరువాత మాత్రమే ప్లష్‌ట్యాంకులోని నీరు టాయిలెట్‌ బవుల్‌లోకి వచ్చేలా చేస్తుంది. తద్వారా టాయిలెట్‌ బవుల్‌లోనుంచి బయటకు వచ్చే సూక్ష్మక్రిములను ఆపవచ్చు. ఈ ఫుట్‌ ఆపరేటర్‌ ద్వారా సోపు, శానిటైజర్‌ కూడా వచ్చేలా చేసుకోవచ్చు. టాయిలెట్‌లోని ఏ భాగాన్ని కూడా చేతితో తాకకుండా నిర్వహించుకోవచ్చు. 



Updated Date - 2022-09-14T06:31:46+05:30 IST