యువ ఓటర్ల నమోదుపై దృష్టి

ABN , First Publish Date - 2020-11-29T04:49:43+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రా మాల్లో అర్హులైన యువ ఓటర్లను నమోదుపై దృష్టి సారించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎచ్చెర్ల నియోజకవర్గ బాధ్యుడు కిమిడి కళావెంకటరావు సూచించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో జి.సిగడాం మండల నాయకులతో సమావేశం నిర్వహించారు.

యువ ఓటర్ల నమోదుపై దృష్టి
బ్రోచర్‌ విడుదల చేస్తున్న కళావెంకటరావు

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ‘కళా’

రాజాం/జి.సిగడాం, నవంబరు 28: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రా మాల్లో అర్హులైన యువ ఓటర్లను నమోదుపై దృష్టి సారించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎచ్చెర్ల నియోజకవర్గ బాధ్యుడు కిమిడి కళావెంకటరావు సూచించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో జి.సిగడాం మండల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు బ్రోచర్‌ను విడుదల చేశారు. రానున్న స్థాని క సంస్థల ఎన్ని కల్లో పోటీ చేసే అభ్యర్థులు డిసెంబరు 15లోగా అర్హులైన యువతీ, యువకులను ఓటర్లుగా నమోదుకు కృషి చేయాలన్నారు. ఎన్ని కల్లో పార్టీ మద్దతుదారుల విజయానికి ఇప్పటినుంచి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కుమరాపు రవికుమార్‌, భూపతి శ్రీరామ్మూర్తి, కామోజుల సీతారాం తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎచ్చెర్ల, లావేరు మండలాల నాయకులు బల్లాడ వెంకటరమణ, ముప్పిడి సురేష్‌ కళావెంకటరావును మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. 

 

Updated Date - 2020-11-29T04:49:43+05:30 IST