టీకా కోసం...

ABN , First Publish Date - 2021-04-24T05:10:19+05:30 IST

కరోనా రెండో దశ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. శుక్రవారం ఆసుపత్రుల్లో తొలి విడత, రెండో విడత వ్యాక్సినేషన్‌కు వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఏర్పాట్లు చేశారు. టెక్కలి, నందిగాం, పోలాకి మండలాల్లోని పీహెచ్‌సీల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు వందలాది మంది తరలిరావడంతో ఆయా ప్రాంగణాలు కిటకిటలాడాయి.

టీకా కోసం...
నందిగాం పీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ కోసం వచ్చిన ప్రజలు


  కిక్కిరిసిన పీహెచ్‌సీలు

  తోపులాటలు, పోలీసుల రంగప్రవేశం

టెక్కలి రూరల్‌/పోలాకి/నందిగాం: కరోనా రెండో దశ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. శుక్రవారం ఆసుపత్రుల్లో తొలి విడత, రెండో విడత వ్యాక్సినేషన్‌కు వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఏర్పాట్లు చేశారు. టెక్కలి, నందిగాం, పోలాకి మండలాల్లోని పీహెచ్‌సీల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు వందలాది మంది తరలిరావడంతో ఆయా ప్రాంగణాలు కిటకిటలాడాయి. వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు గుమిగూడారు. వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌, టీకాలు వేయడం ఒకే ప్రాంతం కావడంతో ప్రజలు గుమిగూడడడంతో పలువురు ఆందోళనకు గురయ్యారు. టెక్కలి ఉన్నత పాఠశాలలో ప్రజలు ఒక్కసారి తరలిరావడంతో విషయం తెలుసుకున్న ఎస్‌ఐలు ఎన్‌.కామేశ్వర రావు, ఎస్‌.గోపాలరావు సిబ్బందితో చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. అలాగే పోలాకి పీహెచ్‌సీలో వ్యాక్సిన్‌ వేస్తున్నారన్న విషయం తెలుసుకుని పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చి తోపులాడుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. నందిగాం పీహెచ్‌సీలో 45 ఏళ్లు పైబడిన వారు ఎక్కువగా తరలిరావడంతో కేవలం 286 మందికే వ్యాక్సిన్‌ సరిపోయింది. మిగిలిన వారు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎండ తీవ్రత ఉండ డంతో వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా పీహెచ్‌సీల ఆవరణల్లో షామియానాలు వేయించారు. అవసరం మేరకు టీకాలను తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయా పీహెచ్‌సీల వైద్యాధికారులు, రెవె న్యూ, మండల పరిషత్‌ అధికారులు పేర్కొన్నారు. 





 

Updated Date - 2021-04-24T05:10:19+05:30 IST