పెదవులు పగలకుండా...

Published: Thu, 08 Oct 2020 11:51:34 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పెదవులు పగలకుండా...

ఆంధ్రజ్యోతి(08-10-2020)

వంటింట్లో ఉండే నెయ్యితో ఆహారానికి రుచిని తేవడంతో పాటు అందాన్ని పెంచుకోవచ్చు.  


కొద్దిగా నెయ్యిని పచ్చి పాలు, సెనగపిండిలో వేసి పేస్ట్‌ తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ను చర్మానికి రాసుకొని నెమ్మదిగా మసాజ్‌ చేసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ను తరచూ వాడితే చర్మానికి తేమ అందుతుంది. నిగారింపు కూడా సొంతమవుతుంది. 


పొడిబారిన, పగుళ్ళు ఏర్పడిన పెదవులకు నెయ్యి చక్కగా పనిచేస్తుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు పెదవులకు నెయ్యి రాసుకొని, మర్ధన చేయాలి. ఉదయాన్నే నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే పెదవులు పొడిబారడం తగ్గిపోతుంది. 


తేమ, పోషణ అందకపోవడం వల్ల కురులు నిర్జీవంగా కనిపిస్తాయి.  టేబుల్‌స్పూన్‌ నెయ్యిని వేడిచేసి చల్లార్చాలి. తరువాత ఆ నెయ్యిని జుట్టుకు పట్టించాలి. రెండు గంటలు అలానే ఉండాలి. తరువాత షాంపూతో తలంటుకుంటే కేశాలు జీవాన్ని పొంది పట్టులా మెరుస్తాయి.


కొంచెం నెయ్యి తీసుకొని, చర్మానికి మసాజ్‌ చేస్తున్నట్టుగా రాసుకోవాలి. కొద్దిసేపు అలానే ఉండి తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. నెయ్యిలో చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేసే గుణాలున్నాయి. ఇవి వయసుతో  వచ్చే ముడతలను తగ్గించి, చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.