ఘనంగా అబ్ద్దుల్‌ కలాం జయంతి

ABN , First Publish Date - 2021-10-17T04:39:45+05:30 IST

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం 90వ జయంతిని శనివారం చేర్యాల మండలం నాగపురి గ్రామంలో అబ్దుల్‌ కలాం సామాజిక సేవాసంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా అబ్ద్దుల్‌ కలాం జయంతి
నాగపురిలో కలాం చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న అబ్దుల్‌ కలాం సామాజిక సేవాసంస్థ ప్రతినిధులు

చేర్యాల, అక్టోబరు 26: మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం 90వ జయంతిని శనివారం చేర్యాల మండలం నాగపురి గ్రామంలో అబ్దుల్‌ కలాం సామాజిక సేవాసంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ బండకింది సంతోషికరుణాకర్‌ మాట్లాడారు. అమోఘమైన మేథాశక్తిని దేశ అభ్యున్నతికి వినియోగించిన మహనీయుడి అడుగుజాడలో నడవాలన్నారు. కార్యక్రమంలో సేవాసంస్థ ప్రతినిధులు బండమీది కరుణాకర్‌, ప్రజ్ఞాపురం ఎల్లేశం, నడిమింటి బాల్‌చంద్రం, కేతోజు సురేశ్‌, సాక్షిత్‌, భాస్కర్‌, భాను, స్వామి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-17T04:39:45+05:30 IST