అమ్మవారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు

ABN , First Publish Date - 2021-10-18T06:02:51+05:30 IST

దేవీనవరాత్రులు ముగింపు సందర్భంగా మండలంలో పలు ఆలయాల వద్ద ఏర్పాటుచేసిన ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు నిర్వహించారు.

అమ్మవారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు

ముమ్మిడివరం, అక్టోబరు 17: దేవీనవరాత్రులు ముగింపు సందర్భంగా మండలంలో పలు ఆలయాల వద్ద ఏర్పాటుచేసిన ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు నిర్వహించారు. బాణసంచా కాల్పులు, బ్యాండుమేళాలతో అమ్మవారిని నగర పురవీధుల్లో ఊరేగించారు. ఠాణేలంక పంచాయతీ పరిధిలోని వడ్డిగూడెంలో శ్రీవిజయదుర్గమ్మ అమ్మ వారి ఆలయం వద్ద భారీ అన్నసమారాధన నిర్వహించారు. గ్రామానికి చెందిన ఓ భక్తుడు 5కిలోల లడ్డూను కానుకగా సమర్పించగా వాసంశెట్టి రమణకుమార్‌ రూ.5600కు వేలంలో దక్కించుకున్నారు.  మొల్లి జీఎంసీకాలనీలో శ్రీవిజయదుర్గమ్మను ఊరేగింపు నిర్వహించారు. గ్రామానికి చెందిన ఆచంట అన్నవరం లడ్డూను సమర్పించగా వాసంశెట్టి నాగమునీంద్రరావు రూ.1100కు  దక్కించుకున్నారు. భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గోదాశివారిపాలెంలో అమ్మవారికి గోదాశి వెంకటేశ్వరరావు 24కిలోల లడ్డూను కానుకగా సమర్పించగా బండారు వీరబాబు రూ.17వేలకు  వేలంలో దక్కించుకున్నారు. 

 

Updated Date - 2021-10-18T06:02:51+05:30 IST