కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయుడు
ఉరవకొండ, మే 16: సాధారణంగా రాజకీయ పార్టీల కార్యక్ర మంలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనరాదు. ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి వజ్రకరూరు మండలంలోని గడేహోతూరులో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శంకర్. ఉరవకొండలో సీవీవీ నగర్ సీసీ రోడ్డు నిర్మాణం భూమి పూజలో రాజకీయ పార్టీ నాయకులతో కలసి సోమవారం పాల్గొనడం విశేషం.