విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం

ABN , First Publish Date - 2022-09-24T05:14:36+05:30 IST

విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడటం సమంజసం కాదని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.

విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం

విద్యార్థి సంఘాల నిరసనకు కాలవ మద్దతు

రాయదుర్గం రూరల్‌, సెప్టెంబరు 23: విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడటం సమంజసం కాదని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం కేటీఎస్‌ డిగ్రీ కళాశాల వద్ద  ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు బంగిశివ, కొట్రేష్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలవ శ్రీనివాసులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడు తూ విద్యార్థులకు 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించిన వి ద్యాదీవెన నిధులు జమ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గు రవుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా కేటీఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 369 మంది విద్యార్థులకు దాదాపు రూ. 69 లక్షలు బకాయి వున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యాదీవెన బకాయి పడ్డ విషయాన్ని ఒక విద్యార్థి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురా వడంతో ఆ విద్యార్థిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సిలింగ్‌ ఇచ్చి పం పడమేంటని ప్రశ్నించారు. తృతీయ సంవత్సరం పూర్తయిన విద్యా ర్థులు పీజీ కోర్సుకు కౌన్సిలింగ్‌కు వెళితే టీసీలు అడుగు తున్నారని, పీజీ కౌన్సిలింగ్‌కు సమయం అయిపోతే సీటు రాదేమో నని విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కళాశా లకు రెండుసార్లు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వచ్చి విద్యాదీవెన పథ కాన్ని ప్రారంభించారన్నారు. రూ.69 లక్షలు బకాయిలు వున్నప్పటికీ ఆయన ఎందుకు అధికారుల దృష్టికి తీసుకెళ్లలేదో అర్థం కావడం లేదన్నారు. విద్యాదీవెన నిధులతో సంబంధం లేకుండా విద్యా ర్థులందరికీ టీసీలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి రాజు, కన్వీనర్‌ హనుమంతరెడ్డి, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు రాజు, తాలుకా అధ్యక్షుడు అంజి, కుమారనాయక్‌, విద్యార్థులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-24T05:14:36+05:30 IST