ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి

Sep 17 2021 @ 00:18AM
క్యామ వెంకటేశ్‌ను సన్మానిస్తున్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

కడ్తాల్‌: సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకుపోయి టీఆర్‌ఎస్‌ పార్టీని పటిష్టం చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. కడ్తాల టీఆర్‌ఎస్‌ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన క్యామ వెంకటేశ్‌కు గురువారం అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ మండల కమిటీలను ఈనెల 20న ఏర్పాటు చేస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రజాభిమానం ముందు స్వార్థశక్తుల కుట్రలు ఫలించవని, మరో 20ఏళ్లు టీఆర్‌ఎ్‌సదే అధికారమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బాచిరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డి, ఉపసర్పంచ్‌ రామకృష్ణ, ఎంపీటీసీ గోపాల్‌, శ్రీను, జహంగీర్‌అలీ, ఇర్ష్యద్‌, యాదయ్య, నర్సింహ, భిక్షపతి, లాయక్‌అలీ, వాణిశ్రీ, చందోజీ, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on: