‘స్పందన’ ఏదీ?

Published: Tue, 09 Aug 2022 01:08:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
స్పందన ఏదీ?

  • జిల్లాలో స్పందన అర్జీలకు కానరాని పరిష్కారం
  • ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరుగుతున్నా పేదలకు దక్కని న్యాయం
  • ఎన్నిసార్లు వచ్చి కలెక్టర్‌కు వినతిపత్రం అందించినా అన్నీ మూలకే
  • పరిష్కరించాల్సిన ప్రభుత్వశాఖలు మా పరిధిలోకి రాదంటూ అర్జీ వేరొకరికి బదిలీ
  • ఆనక తమ రికార్డుల్లో పరిష్కారం జాబితాలో చేర్చేస్తున్న జిల్లా అధికారులు
  • జిల్లాల పునర్విభజన తర్వాత కాకినాడ జిల్లాకు 5,242 అర్జీలు రాక
  • అత్యధికంగా భూ సమస్యలు, బీమా పరిహారం, రేషన్‌, పెన్షన్లు, ఇళ్లస్థలాలపైనే..
  • ఇలా వచ్చిన 5,242 అర్జీల్లో 4,779 పరిష్కరించేసినట్లు కాకిలెక్కలు
  • ఎస్పీ కార్యాలయానికి వచ్చిన అర్జీలూ స్టేషన్లకు పంపి పరిష్కారం కలరింగ్‌

జిల్లాలో ‘స్పందన’కు అందిన అర్జీలపై ప్రభుత్వం నుంచి స్పందన ఉండడంలేదు. ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరుగుతూ కలెక్టర్‌కు అర్జీలు ఇస్తున్నా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రం కాకినాడలో కలెక్టర్‌ సమక్షంలో నిర్వహిస్తున్న స్పందనపై ఎన్నో ఆశలతో జిల్లానలుమూలలనుంచి ప్రజలు వచ్చి అర్జీలు ఇస్తున్నారు. తమ సమస్యలను స్థానిక అధికారులకు పదేపదే విన్నవించి పరిష్కారం కాక విసిగిపోయి ఇక్కడకు వస్తున్నారు. తీరా వీటిని తీసుకుంటున్న అధికారులు తమ పరిధి కాదంటూ తిరుగుటపాలో సచివాలయాలకే పంపుతున్నారు. దీంతో వేలాది అర్జీలు మూలకు చేరుతున్నాయి. బాధితులకు కన్నీళ్లు మిగుల్చుతున్నాయి. 

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

కాకినాడ జిల్లాలో ఇప్పటివరకు 5,242అర్జీలు రాగా వీటిలో ఏకంగా 4,779 పరిష్కరించేసినట్లు అధికారులు కాకి లెక్కలు చూపుతున్నారు. ఇవన్నీ నిజంగా పరిష్కరించారనుకుంటే త ప్పులో కాలేసినట్లే. స్పందనలో వచ్చిన అర్జీ తమ పరిధిలోకి రాదంటూ వేరొక శాఖ, లేదా మండలస్థాయికి ఫార్వార్డ్‌ చేసి తమ రికార్డుల్లో పరిష్కరించేసినట్లు చూపుతున్న లెక్కలివి.

ఆశతో వస్తే నీరుగార్చేస్తున్నారు..

తమ కష్టాలు, బాధలు, ప్రభుత్వ పథకాలు అందక ఇబ్బం ది పడుతున్న వైనాన్ని ప్రజలు స్వయంగా జిల్లా అధికారులకు వివరించి న్యాయం పొందడం కోసం గత ప్రభుత్వాలు వారాని కోసారి స్పందన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాయి. ఇందు లోభాగంగా కాకినాడలో జిల్లాస్థాయి స్పందన ప్రతి సోమ వారం కలెక్టర్‌ నిర్వహిస్తున్నారు. దీనికి అన్ని ప్రభుత్వశాఖల అధికారులు హాజరై ప్రజలనుంచి వచ్చే అర్జీలు పరిశీలిస్తున్నాయి. వైసీపీ అధికారం లోకి వచ్చిన తర్వాత ప్రజలనుంచి వచ్చే అర్జీలు పెరిగిపోయా యి. రేషన్‌కార్డు తొలగించేశారని, అర్హత ఉన్నా పెన్షన్‌ పీకేశా రని కొందరు, ఇంట్లో తమ కుటుంబసభ్యుడు చనిపోయినా ఇంకా ప్రభుత్వం నుంచి బీమా పరిహారం రాలేదని మరికొంద రు, ఇళ్లస్థలాలు తమకు ఇవ్వలేదని ఇంకొందరు దరఖాస్తులు ఇస్తున్నారు. ఇలా ప్రతివారం వందల్లో అర్జీలు అధికారులకు అందుతున్నాయి. ప్రతివారం వచ్చే అర్జీల్లో ఎక్కువగా రెవె న్యూశాఖకు చెందిన సమస్యలే అధికంగా ఉంటున్నాయి. తమ భూమి సరిహద్దులు మార్చేశారని, ఆక్రమించేశారని, న్యాయ స్థానం ఆదేశాలు కూడా పోలీసులు అమలు చేయడం లేదని అనేకమంది అర్జీలు పెడుతున్నారు. రెవెన్యూ రికార్డుల్లో సర్వే నెంబర్లు, సరిహద్దులు మారిపోయాయని మరికొందరు అధి కారులకు అర్జీ పెడుతున్నారు. వీటిని పరిష్కరించే విషయం లో ప్రభుత్వంనుంచి స్పందన ఉండడం లేదు. కేవలం స్పంద నలో వచ్చే అర్జీని నమోదు చేసుకోవడం, ఆనక వీటిని పరి ష్కరించాలంటూ సంబంధిత మండల అధికారులకు పంపిం చి జిల్లా అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారు. దీంతో బాధితులకు న్యాయం జరగడం లేదు.

పని ఒత్తిడి, హడావుడిలో పక్కకు..

వాస్తవానికి కలెక్టర్‌ వద్దకు వచ్చే అర్జీదారుల్లో అనేకమంది అప్పటికే తమ సమస్యను వాళ్ల మండలంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కాక ఇక్కడకు వస్తున్నారు. కా నీ జిల్లా స్పందన అధికారులు ఇదేదీ పట్టించుకోకుండా సులు వుగా అర్జీని సంతకం చేసి అదే మండలానికి తిరుగుటపాలో పంపుతున్నారు. దీనివల్ల ఎక్కడి సమస్య అక్కడే పరిష్కారం కాకుండా ఉంటోంది. ఇలా ఒకటేంటి వేలాది అర్జీలు ఇలాగే మూలుగుతున్నాయి. జిల్లా అధికారులైనా తమ సమస్యను పరిష్కరించకపోతారా అని ఆశగా చూస్తున్న జనానికి చివర కు ఏళ్ల తరబడి నిరీక్షణే మిగులుతోంది. జిల్లాస్థాయి స్పందన ను కలెక్టర్‌ అప్పుడప్పుడు ఇతర నియోజకవర్గాల్లో నిర్వహిస్తు న్నారు. ఇక్కడా వందలాది అర్జీలు వస్తున్నాయి. అవి కూడా మండలాలకు బదిలీ అవుతున్నాయంతే. వాస్తవానికి అర్జీలు వచ్చిన గంటల వ్యవధిలోనే జిల్లా అధికారులు వాటిని పరిశీలి స్తున్నారు. పనిఒత్తిడి, వీడియో కాన్ఫరెన్స్‌ల హడావుడిలో ఇవి మర్చిపోతు న్నారు. ఎప్పట్లా తమ మండలస్థాయి సిబ్బందికి పంపి ఈ అర్జీ చూడండి అంటూ ఆన్‌లైన్‌లో పంపి చేతులు దులి పేసుకుంటున్నారు. అక్కడ అప్పటికే వందల్లో మూలు గుతున్న అర్జీల జాబితాలోకి ఇవి చేరిపోతున్నాయి.

అన్నీ పరిష్కరించేశారంట..

మొన్న ఏప్రిల్‌లో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కాకినాడ జిల్లాలో స్పందన అర్జీల ను కొత్తగా నమోదు చేస్తున్నారు. ఇప్పటివ రకు 5,242 అర్జీలు వచ్చాయి. ఇందులో భూ సమస్యలు, రేషన్‌కార్డులు, పింఛన్లు కావాల ని, బీమా పరిహారం, ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని, వివిధ గ్రామసమస్యలు ఎక్కువ గా ఉన్నాయి. పోలీసు, రెవెన్యూశాఖల్లో అవి నీతి, మున్సిపాల్టీల్లో అక్రమాలపైనా అర్జీలు వచ్చాయి. వీటిలో ఏకంగా 4,779 అర్జీలు పరి ష్కరించేసినట్లు జిల్లా అధికారులు కాకిలెక్క లు చూపుతుండడం విశేషం. వాస్తవానికి స్పందన అర్జీలు ఎక్కువగా పెండింగ్‌లో చూపిస్తే ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తుందనే కారణంతో దాదాపుగా అన్నింటినీ పరిష్కరించేసినట్లు చూపుతున్నారు. కానీ ఇవేవీ నిజంగా పరిష్కరించినవి కావు.

శాఖలు మారుస్తారంతే..

ఏదైనా అర్జీ జిల్లా ప్రభుత్వశాఖకు వస్తే దాన్ని పరిశీలించి న తర్వాత తమశాఖ పరిధిలోకి రాకపోతే ఆన్‌లైన్‌లో వేరే విభాగానికి పంపుతారు. అప్పుడు దాన్ని తమ శాఖ రికార్డుల్లో పరిష్కారం కింద చూపించేస్తున్నారు. ఒకవేళ తమశాఖకు చెందిందే అయితే అర్జీదారుడి మండలానికి పంపిస్తున్నారు. అలా పంపించారు కాబట్టి దాన్ని కూడా తమ రికార్డుల్లో పరిష్కారం కింద లెక్కగట్టేస్తున్నారు. రెవెన్యూశాఖకు సంబంధించి భూసరిహద్దు వి వాదం వస్తే ఆర్‌ఐ లేదా సర్వేయర్‌కు పంపి దా న్ని మండల రెవెన్యూ అధికారులు పరిష్కారం కింద లెక్కగట్టేస్తున్నారు. రేషన్‌కార్డులు, పింఛ న్లు, పథకం కింద డబ్బులు రాలేదని వచ్చిన అ ర్జీలను సచివాలయాలకు ఫార్వార్డ్‌ చేసి తమ రి కార్డుల్లో పరిష్కరించేసినట్లు చూపిస్తుండడం వి శేషం. మండలాల్లో పదేపదే తిరిగి విసిగిపోయి కలెక్టర్‌కు అర్జీ ఇస్తే అది తిరిగి అదే మండల కా ర్యాలయానికి వస్తోంది. ఇక జిల్లా పోలీసుశాఖ కు వచ్చే స్పందన అర్జీల్లో ఆర్థిక మోసాలు, చీటీ డబ్బులు ఎగ్గొట్టడం, ఆన్‌లైన్‌ గేమ్‌లు, వేధింపు లు, భూతగాదాలు అధికం. వీటిని ఆయా స్టేషన్‌లకు ఎస్పీ కార్యాలయం నుంచి పంపించి పరిష్కరించిన ఖాతాల్లో చేర్చేస్తున్నారు.

అర్జీదారుడి ఆత్మహత్యాయత్నం

కాకినాడ క్రైం, ఆగస్టు 8: ఎక్కడికెళ్లినా తనకు న్యాయం జరగదని భా వించిన ఓ అర్జీదారుడు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన సోమవారం కాకినాడ కలెక్టరేట్‌ స్పందన హాలువద్ద జరిగింది. దీనికి సంబంధించిన వివరాలివి. కాజులూరు మండలం ఉప్పుమిల్లి గ్రామానికి చెందిన గుత్తుల శ్రీనివాస్‌ను గతనెల 19న తాళ్లరేవు మండలం పటవల సమీపంలో కారు ఢీకొట్టింది. దీంతో అతడు గాయపడ్డాడు. కాగా యాక్సిడెంట్‌ చేసినవారికే పోలీసులు వత్తాసు పలకడంతో బాధితుడు గతవారం కాకినాడలోని ఎస్పీ కార్యాలయ స్పందనలో ఫిర్యాదు చేశాడు. అక్కడ కూడా శ్రీనివాస్‌కు న్యాయం జరగకపోవడంతో ఈ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్‌కు వచ్చాడు. ఇక్కడ కూడా తనకు న్యాయం జరగదేమోనని భావించి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేందుకు డబ్బా మూత తీస్తుండగా కలెక్టరేట్‌ ఔట్‌పోస్టు పోలీసులు గమనించారు. వెంటనే డబ్బా అతడినుంచి లాక్కుని అతడ్ని అదుపులోకి తీసుకుని కాకినాడ త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

సర్వే చేయకుండా తిప్పుతున్నారు

కొప్పన లక్ష్మణస్వామి, ఒమ్మంగి, ప్రత్తిపాడు మండలం

ప్రత్తిపాడు మండలం ఒమ్మం గి లో సర్వే నెంబరు 10లో నా 3.14 సెంట్లు భూమి సర్వే కోసం రెండేళ్లనుంచి తిప్పుతున్నారు. 2022, జనవరిలో తప్పుడు సర్వే చేసి పక్క భూమిలో చూపించా రు. ఆ తర్వాత జిల్లా గ్రీవెన్స్‌కు పలుమార్లు అర్జీ పెట్టుకున్నాను. అంత దూరం నుంచి స్పందనకు తిరుగుతున్నా సర్వే చేయడం లేదు. 

పంట నష్టపరిహారం ఇవ్వలేదు

ముత్యాల నాగేశ్వరరావు, వేళంగి, కరప మండలం

కరప మండలం యండమూ రులో నాపదెకరాల పంటభూమి నష్టపరిహారం ఇంతవరకు ఇవ్వ లేదు. 2020-21కు సంబంధించి నాకు రూ.లక్షా80వేల పంట నష్ట పరిహారం చెల్లించకుండా తిప్పు తున్నారు. గడువు దాటాక మళ్లీ అర్జీ పెడుతున్నాను. ఇలా ఐదుసార్లు దాఖలు చేశాను. 14 నెలల అయినా నష్టపరిహారం అందలేదు.

బియ్యం కార్డు ఇప్పించండి

గోపిశెట్టి దేవి, బెండపూడి, తొండంగి మండలం 

నాకు ఏ ఆధారం లేదు. బియ్యం కార్డు ఇప్పించాలని నా ఏడేళ్ల కుమారుడితో స్పం దనలో మొరపెట్టుకున్నాను. నా భర్త ఆరేళ్ల క్రితం వదిలి వెళ్లిపోవడంతో కుమారుడిని పోషించుకోవడం కష్టంగా ఉంది. నా భర్త ఆచూకీ కోసం తుని పోలీస్‌స్టేషన్‌లోను పలుమార్లు ఫిర్యాదు చేశాను. అయినా ఆచూకీ లభ్యం కాలేదు. కనీసం బియ్యం కార్డు ఇచ్చి ఆదుకోవాలి.

జిల్లాస్థాయి ‘స్పందన’కు 364 అర్జీలు

కాకినాడ సిటీ, ఆగస్టు 8: కాకినాడ కలెక్టరేట్‌లో సోమ వారం నిర్వహించిన జిల్లాస్థాయి స్పందన కార్యక్రమానికి 364 అర్జీలందాయి. ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, రెవెన్యూ సేవలు, సర్వే, పెన్షన్‌, బీమా తదితరాలపై అర్జీలు చేసుకున్నారు. కార్యక్రమంలో జేసీ ఎస్‌.ఇలాక్కి య, డీఆర్‌వో కె.శ్రీధర్‌రెడ్డి, కాకినాడ సెజ్‌ స్పెషల్‌ డిప్యూ టీ కలెక్టర్‌ కె.మనోరమ, పౌరసరఫరాల జీఎం డి.పుష్ప మణిలతో కలిసి ప్రజలనుంచి విజ్ఞాపనలు స్వీకరించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.