ప్రశాంతంగా గురుకులాల ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2021-07-26T03:32:54+05:30 IST

మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్‌, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇందుకోసం మెదక్‌ జిల్లా కేంద్రంలో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం తొమ్మిది గంటలకే విద్యార్ధులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షను నిర్వహించారు.

ప్రశాంతంగా గురుకులాల ప్రవేశ పరీక్ష
సంగారెడ్డిలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు

మెదక్‌ అర్బన్‌/సంగారెడ్డి అర్బన్‌/సిద్దిపేట ఎడ్యుకేషన్‌, జూలై 25 : మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్‌, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇందుకోసం మెదక్‌ జిల్లా కేంద్రంలో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం తొమ్మిది గంటలకే విద్యార్ధులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షను నిర్వహించారు. మెదక్‌ జిల్లావ్యాప్తంగా ఇంటర్‌లో 1,121 మంది విద్యార్ధులకు గానూ 852 మంది (76శాతం) హాజరయ్యారు. 269 మంది గైర్హాజరయ్యారు. డిగ్రీలో 151 మందిగానూ 129 (85.4 శాతం) హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లాలో 11 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,786 మందికిగాను 1,398 మంది పరీక్షకు హాజరయ్యారు. 388 మంది గైర్హాజరయ్యారు. 78 శాతం హాజరు నమోదైంది. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట పట్టణంలో 6, ఇర్కోడ్‌లో ఒక కేంద్రాలను ఏర్పాటు చేశారు. జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశానికి 1,039 మందికి గాను 744 మంది హాజరయ్యారు. 295 మంది గైర్హాజరయ్యారు. 71.60 శాతం మంది హాజరయ్యారు. గురుకుల డిగ్రీ కళాశాలలో అడ్మిషన్‌ కోసం 143 మంది విద్యార్థులకుగాను 122 మంది విద్యార్థులు హాజరయ్యారు. 31 మంది గైర్హాజరయ్యారు. 85.31 శాతం హాజరు నమోదయ్యింది.


ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్‌

సిద్దిపేట ఎడ్యుకేషన్‌, జూలై 25 : జేఈఈ మెయిన్స్‌ పరీక్ష ఆదివారం ఇందూరు ఇంజనీరింగ్‌ కళాశాలలో జరిగింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు  మొదటి సెషన్‌లో మొత్తం 50 మంది విద్యార్థులకుగాను 39 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు జరిగిన రెండో సెషన్‌లో 50 మంది విద్యార్థులకుగాను 37 మంది హాజరయ్యారు. 13 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ప్రిన్సిపాల్‌ వీపీరాజు తెలిపారు. 

Updated Date - 2021-07-26T03:32:54+05:30 IST