22 నుంచి ‘హనుమ’ నాటకోత్సవాలు

ABN , First Publish Date - 2021-11-26T06:46:04+05:30 IST

అభినయ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో డిసెంబరు 22నుంచి 26వ తేది వరకు ‘హనుమ’ అవార్డు నాటకోత్సవాలు, కళాప్రదర్శనలు నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి, వ్యవస్థాపక కార్యదర్శి బీఎన్‌ రెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో గురువారం వీరు మీడియాతో మాట్లాడారు.

22 నుంచి ‘హనుమ’ నాటకోత్సవాలు
మీడియాతో మాట్లాడుతున్న అభినయ ఆర్ట్స్‌ వ్యవస్థాపక కార్యదర్శి బీఎన్‌ రెడ్డి

తిరుపతి(కొర్లగుంట), నవంబరు 25: అభినయ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో డిసెంబరు 22నుంచి 26వ తేది వరకు ‘హనుమ’ అవార్డు నాటకోత్సవాలు, కళాప్రదర్శనలు నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి, వ్యవస్థాపక కార్యదర్శి బీఎన్‌ రెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో గురువారం వీరు మీడియాతో మాట్లాడారు. టీటీడీ సౌజన్యంతో మహతి ఆడిటోరియంలో భరతనాట్యం, కూచిపూడి, జానపదబృందనృత్యం, సోలో నృత్యాలతో పాటు స్థానిక రంగస్థల కళాకారుల వ్యాథగీత, శివపార్వతుల కల్యాణం, చిన్నకృష్ణవిజయం, శ్రీపద్మావతి శ్రీనివాసకల్యాణం, సాంఘిక నాటక కుసుమం, పౌరాణిక ఘట్టాలు ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కూచిపూడి, భరతనాట్యం, జానపద ప్రదర్శనల్లో పాల్గొనడానికి ఆసక్తిగల కళాకారులు డిసెంబరు 5లోపు పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 95811 54667 నెంబరులో సంప్రదించాలన్నారు. చివరిరోజున ఉత్తమప్రదర్శన కళాకారులకు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేస్తామన్నారు. ఈ మీడియా సమావేశంలో ఆర్ట్స్‌ ఉపాధ్యక్షులు గజేంద్ర, ధర్మయ్య, శైలజారెడ్డి, శంకరన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-26T06:46:04+05:30 IST