జై అంజనీపుత్ర

ABN , First Publish Date - 2022-05-26T06:13:40+05:30 IST

హనుమాన్‌ జయంతి సందర్భంగా బుధవారం నగరంలోని పలు డివిజన్లలో గల ఆంజనేయ స్వామి ఆలయాల వద్ద పూజలు, అభిషేకాలు, సామూహిక పారాయణలు నిర్వహించారు.

జై అంజనీపుత్ర
కామవరపుకోటలో ఆంజనేయస్వామి

వైభవంగా హనుమాన్‌ జయంతి వేడుకలు 

ఆలయాల్లో విశేష పూజలు అన్నసమారాధనలు 

ఏలూరు కార్పొరేషన్‌, మే 25 : హనుమాన్‌ జయంతి సందర్భంగా బుధవారం నగరంలోని పలు డివిజన్లలో గల ఆంజనేయ స్వామి ఆలయాల వద్ద పూజలు, అభిషేకాలు, సామూహిక పారాయణలు నిర్వహించారు. భక్తు లు సామూహికంగా తమలపాకులు, సింధూరంతో అర్చనలు జరిపారు. హనుమాన్‌చాలీసా పారాయణలు నిర్వహిం చారు. వెంకన్నచెరువు సమీపంలో గల ఆంజనేయ స్వామిని మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ దంపతులు పూజలు చేశారు. ఆల యాల వద్ద భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. 

కామవరపుకోట : స్థానిక రావిచెట్టు వద్ద గల అభయాంజనేయ స్వామికి గ్రామానికి చెందిన ఆర్యవైశ్యులు కొండూరు సురేష్‌, కాకి శ్రీనివాసరావు దంపతులు పూజలు చేశారు. 

గణపవరం : గణపవరం సువర్చల సమేత ఆంజనేయస్వామి ఆల యంలో కూనపరాజు అశ్వనివర్మ, ఉమాదేవి దంపతులచే పంచామృతా భిషేకాలు, తమలపాకులతో పూజలు నిర్వహించి కర్పూర హారతి ఇచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్‌ వి.రామారావు, ఉపాధ్యక్షుడు డి.రాజబాబు పాల్గొన్నారు.

దెందులూరు : పలు గ్రామాల్లో గల ఆంజనేయస్వామి ఆలయాల్లో హను మాన్‌ చాలీసా పారాయణం, తమలపాకులతో అర్చనలు చేశారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. 

పోలవరం :గూటాల, పోలవరం గ్రామాల్లో ఆంజనేయుడికి లక్ష తమలపాకుల పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గూటాలలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద అన్నదానం నిర్వహించారు. 

భీమడోలు :గుండుగొలను సీతారామస్వామి ఆలయంలో హనుమాన్‌ చాలీసా పారాయణ నిర్వహించారు. అనంతరం  గ్రామోత్సవం నిర్వహించారు. కె.గంగరాజు కుమార్‌, పాల్గొన్నారు. .

టి.నర్సాపురం : కృష్ణాసురం గ్రామంలో బుక్యా వేణుగో పాల్‌ ఆధ్వర్యంలో పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం వద్ద ఎంపీపీ దారబోయిన లక్ష్మీ చేతుల మీదుగా 30 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. గంగినీడిపాలెంలో 21 కలశాలతో గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. 

నిడమర్రు : భువనపల్లి అభయాంజనేయస్వామి ఆలయంలో గ్రామ స్థులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చేయించిన రూ. 3 లక్షల విలువైన వెండి కిరీటం, అభయహస్తం  ఎమ్మెల్యే వాసుబాబు చేతుల మీదుగా స్వామికి అలంకరించి పూజలు నిర్వహించారు. సర్పంచ్‌ కిలారి రవిబాబు, ఉపసర్పంచ్‌ వెల్లంకి నరేష్‌కుమార్‌ పాల్గొన్నారు. 

పెదపాడు : అప్పనవీడు అభయాంజనేయస్వామి దేవస్థానంలో పలు రకాల పూలతో పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి లడ్డూను వేలంపాట నిర్వహించారు. అప్పనప్రసాద్‌, ఈవో ఎన్‌.సతీష్‌కుమార్‌ పాల్గొ న్నారు. పెదపాడు బస్టాండ్‌సెంటర్‌లో అభయాంజనేయస్వామి దేవాలయం వద్ద రేములగడ్డ రాము ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహించారు.

Updated Date - 2022-05-26T06:13:40+05:30 IST