ఎస్‌ఎస్‌బీఎన్‌లో పోలీసుల లాఠీచార్జ్‌

ABN , First Publish Date - 2021-11-09T07:12:20+05:30 IST

ఎయిడెడ్‌ కళాశాలగానే కొనసాగించాలంటూ జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎస్‌బీఎన కళాశాల (శ్రీసాయి బాబా నేషనల్‌ కాలేజీ) విద్యార్థులు శాంతియుతంగా చేస్తున్న నిరసనపై పోలీసులు లాఠీ ఝుళిపించారు.

ఎస్‌ఎస్‌బీఎన్‌లో పోలీసుల లాఠీచార్జ్‌
విద్యార్థిని పోలీసు వాహనంలోకి బలవంతంగా తోస్తున్న దృశ్యం

  • విద్యార్థులపై కాఠిన్యమా.?
  • ఎయిడెడ్‌గానే కొనసాగించాలని విద్యార్థుల నిరసన
  • మద్దతుగా నిలిచినవిద్యార్థి సంఘాల నాయకులు
  • ఖాకీల దాష్టీకం.. 
  • పలువురికి గాయాలు ఆరుగురు విద్యార్థులు, 
  • ముగ్గురు నేతల అరెస్టు
  • నేడు విద్యా సంస్థల బంద్‌కు పిలుపు
  • రేపు నారా లోకేష్‌ రాక
  • సంఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశం
  • కాలేజీకి రెండు రోజులు సెలవు
  • లాఠిన్యంపై నేతల మండిపాటు


ఎయిడెడ్‌ కళాశాలగానే కొనసాగించాలంటూ జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎస్‌బీఎన కళాశాల (శ్రీసాయి బాబా నేషనల్‌ కాలేజీ) విద్యార్థులు శాంతియుతంగా చేస్తున్న నిరసనపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై పలు రాజకీయ పార్టీల నాయ కులు, విద్యార్థి సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా నిరసన చేసే విద్యార్థులు, సంఘాల నాయకులను పోలీసులు కొట్టడాన్ని దారుణంగా, హేయంగా అభివర్ణించారు. తమ ఎయిడెడ్‌ కళాశాలను ప్రైవేటీకరించరాదంటూ ఆ కళాశాల విద్యార్థులు సోమవారం శాంతియుత నిరసనకు దిగారు. దీనికి పలు విద్యార్థి సంఘాల నాయకులు  మద్దతు  తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యమం ఉధృతమవుతుందని భావించిన పోలీసులు విద్యార్థులపై లాఠీలు ఝుళిపించారు. విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. దీనిపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ నుంచి స్థానిక నాయకుల వరకూ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఆందోళన కార్యక్రమంలో గాయపడిన విద్యార్థులను పరామర్శించి, వారికి భరోసా కలిగిం చటానికి నారా లోకేష్‌ బుధవారం జిల్లాకు రానున్నారు. జరిగిన దుస్సంఘటనకు నిరసనగా విద్యార్థి సంఘాలు మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. 


అనంతపురం విద్య, నవంబరు 8: తమ కళాశాలను ఎయిడెడ్‌ కళాశాలగానే కొనసాగించాలంటూ ఎస్‌ఎ్‌సబీఎన కళాశాల (శ్రీసాయిబాబా నేషనల్‌ కాలేజీ) విద్యార్థులు చేస్తున్న శాంతియుత నిరసన పోలీసుల తీరు తో ఉద్రిక్తంగా మారింది. సో మవారం ఉదయమే కళాశాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు కళాశాలలో నిరసనకు దిగారు.  కళాశాలను ప్రైవేటీకరిస్తే ఫీజు లు భారీగా పెరుగుతాయని, ఎయిడెడ్‌గా కొనసాగించడానికి యాజమాన్యం ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు నిరసనకు తరలివచ్చారు. విద్యార్థుల ఆందోళనకు ఎస్‌ఎ్‌ఫఐ, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా నాయకులు మద్దతుగా నిలిచారు. వి ద్యార్థులు, సంఘాల నాయకులు కళాశాల ఆవరణలో శాంతియుతంగా నిరసన కొనసాగించారు. ఉదయం 9.45 గంటల వరకూ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఆవరణలో రోడ్డుపైకి రాకుండానే ఆందోళన చేశారు. పోలీసులు రంగప్రవేశంతో ఆ నిరసన కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని కళాశాల విద్యార్థులు అడ్డుకున్నారు. మెయిన్‌గేటు వేసి నాయకులను అరెస్టు చేయవద్దంటూ భీష్మించారు. దీంతో రెచ్చిపోయిన పోలీసులు విద్యార్థులను చితకబాదారు. ఈ క్రమంలో కొందరు రాళ్లు విసిరారు. లాఠీలతో పోలీసులు పరుగులు తీయించారు. దొరికిన వారిని చొక్కాలు పట్టుకుని ఈడ్చి పడేశారు.  వారు విద్యార్థులు అన్న విషయం కూడా మర్చిపోయి చొక్కాలు పట్టుకుని కొట్టారు. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు పరుగులు తీశారు. విద్యార్థులను వెం బడించి కొట్టారు. బీఏ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థిని జయలక్ష్మి తలకు గాయాలయ్యాయి. సుమారు 15 మంది గాయపడ్డారు. చాలా మందికి మూగ దెబ్బలు తగిలాయి. కళాశాలలో చదివే విద్యార్థులు ఆరుగురు, ముగ్గురు నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు.  


పోలీస్‌ లాఠీచార్జ్‌పై నారా లోకేష్‌ ఆగ్రహం 

- గాయపడ్డ విద్యార్థినికి ఫోన్లో పరామర్శ

విద్యార్థులు నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్‌ సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎ్‌సబీఎన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయటం దారుణమని ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. లాఠీచార్జ్‌లో గాయపడ్డ విద్యార్థిని గురించి తెలుగుయువత నాయకుడు నారాయణస్వామి, టీఎనఎ్‌సఎ్‌ఫ నేతలు జగదీశ, లోకేష్‌, లక్ష్మీనరసింహా  తదితరులు ఫోన్లో నారా లోకే్‌షకు తెలిపారు. దీంతో ఆయన గాయపడ్డ విద్యార్థినితో మాట్లాడి, ధైర్యంగా ఉండాలని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విద్యార్థులపై లాఠీ చార్జ్‌ చేయడం జగనరెడ్డి అహంకార ధోరణికి నిదర్శనమన్నారు.  గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని లాఠీచార్జ్‌ చేసిన  పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. కాగా లాఠీచార్జ్‌లో గాయపడిన  విద్యార్థులను పరామర్శిం చడానికి నారా లోకేష్‌ బుధవారం అనంతపురం వస్తున్నట్లు రాష్ట్ర పార్టీ తెలిపింది.  













విద్యార్థులపై లాఠీచార్జ్‌  దుర్మార్గం : కాలవ, మాజీ మంత్రి

ఎస్‌ఎస్‌బీఎన విద్యార్థులపై లాఠీచార్జ్‌ చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి, టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. చదువుకొనే విద్యార్థులను అమానుషంగా కొట్టమని ఏ చట్టం చెబుతోందని పోలీసులను ప్రశ్నించారు. జగన నియంతృత్వానికి కొమ్ముగాస్తున్న పోలీసులు రేపు చట్టం ముందు దోషులుగా నిలబడక తప్పదని హెచ్చరించారు. వైసీపీ నిరంకుశ పాలనపై ప్రజాస్వామ్య వాదులందరూ సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సంఘటనను జాతీయ మానవ హక్కులు, జాతీయ మహిళా కమిషన దృష్టికి తీసుకెళ్తామన్నారు. 


విద్యార్థులతో చెలగాటం ఆడొద్దు 

- పయ్యావుల కేశవ్‌, పీఏసీ చైర్మన

విద్యార్థులు న్యాయం కోసం ఆందోళన చేస్తే పోలీసులు లాఠీ జులుం ప్రదర్శించడం దుర్మార్గమని ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన పయ్యావుల కేశవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండని సూచించారు. అధికారం మత్తులో పోలీసులు విద్యార్థులు అని కూడా చూడకుండా వ్యవహరించడం బాధాకరమన్నారు. విద్యార్థులు తమ భవిష్యత కోసం ఆందోళన చేయడం తప్పా అని కేశవ్‌ ప్రశ్నించారు. 


విద్యార్థులపై దాడి అమానుషం : పరిటాల సునీత, నిమ్మల 

ప్రభుత్వ విధానాలతో భవిష్యత్తుపై ఆందోళన చెంది, నిరసన చేస్తున్న విద్యార్థులపై  పోలీసులు లాఠీచార్జ్‌ చేయటం దుశ్చర్య అని మాజీ మంత్రి పరిటాల సునీత, నాయకులు పరిటాల శ్రీరామ్‌, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌, ఎంపీ నిమ్మల కిష్టప్ప మండి పడ్డారు. పెనుకొండలో వారు విలేకరులతో మాట్లాడుతూ ఎస్‌ఎ్‌సబీఎన  కళాశాల ఘటనలో పోలీసుల తీరును తప్పుబట్టారు. ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిరసనలు జరుగుతాయని అలాంటి సమయంలో పోలీసులు సంయమనం పాటించాల్సిందిపోయి లాఠీచార్జ్‌ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. ఎస్‌ఎ్‌సబీఎన కళాశాలలో ఆందోళన చేస్తున్న విద్యా ర్థులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్‌ చేయ టం  ప్రభుత్వం పిరికిపంద చర్య అని హిందూపురం పార్లమెంట్‌ తెలుగు యువత అధ్యక్షుడు షేక్‌ బాబ్జాన, గ్రంథాలయ సంస్థ మాజీ చైౖర్మన గౌస్‌మోద్దీన తెలిపారు. ప్రభుత్వం చేసే ప్రతి పనికిమాలిన చర్యకు పోలీసులు వత్తాసు పలుకుతూ విద్యార్థులపై దాడిచేయడం అమా నుషమన్నారు.   


పోలీసులు కొట్టడం న్యాయమా : వైకుంఠం

విద్యార్థులు  న్యాయం కోసం ఆందోళన చేస్తే పోలీసులు కొట్టడం న్యాయమా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి ప్రశ్నించారు. పోలీసుల లాఠీచార్జ్‌లో  పలువురు విద్యార్థులు గాయపడ్డారని తెలియగానే  ఆయన నేరుగా కళాశాల వద్దకు వెళ్లారు. అనంతరం  పోలీ్‌సస్టేషనకు  చేరుకుని పోలీసులతో ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ విద్యార్థులపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన నియంతృత్వ నిర్ణయాలు తీసుకొని విద్యా వ్యవస్థను నాశ నం చేస్తున్నారన్నారు.  విద్యార్థులకు టీడీపీ అండగా ఉం టుందని భరోసా ఇచ్చారు. సొంత పూచికత్తపై అరెస్ట్‌ చేసిన విద్యార్థులను విడుదల చేయించారు.


వైసీపీని విద్యార్థులే ఉరికించి కొడతారు : బీజేపీ

శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను చితకబాదిన వైసీపీని విద్యార్థులే ఉరికించి కొట్టే రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షు డు సందిరెడ్డి శ్రీనివాసులు సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ఎత్తి వేయడమే కాకుండా విద్యార్థులపై 50 శాతం ఫీజుల భారాన్ని మోపడం సీఎం జగన మోసపూరిత తత్వానికి నిదర్శనమన్నారు. వైసీపీకి వంతపాడుతున్న పోలీసులపై ప్రజలే తిరగబడి బుద్ధి చెబుతారన్నారు. విద్యార్థులపై లాఠీచార్జ్‌ చేసిన పోలీసులు, సీఎం జగన క్షమాపణ చెప్పాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి డిమాండ్‌చేశారు. సోమవారం ఎస్‌ఎస్‌బీఎన కళాశాల ప్రిన్సిపాల్‌ను కలిసి విద్యార్థులను చితకబాదిన పోలీసు లపై ఫిర్యాదు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు.  


దాడి చేయించిన జగన్‌పై కేసు పెట్టాలి :   జేసీ ప్రభాకర్‌రెడ్డి

విద్యార్థులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని విద్యార్థినులపై దాడులు చేయించిన జగన్‌రెడ్డిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టాలని మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. విద్యార్థులపై పడిన ఒక్కో లాఠీ దెబ్బకు జగన్‌రెడ్డి ప్రభుత్వానికి దగ్గర పడుతున్న గడి యలుగా లెక్కవేసుకోవాలన్నారు. తుగ్లక్‌ జగన్‌ పాలనలో విద్యా వ్యవస్థ నాశనం చేశారన్నారు. ప్రభుత్వాలను కూలదోసిన చరిత్ర విద్యార్థులకు ఉందని, సామాన్యుల్లా వారినీ మోసం చేయాలని చూస్తే చెల్లదన్నారు. 


లాఠీచార్జ్‌  సరికాదు - కత్తి నరసింహారెడ్డి, ఎమ్మె ల్సీ 

 ఎస్‌ఎ్‌సబీఎన్‌ ఎయిడెడ్‌ కళాశాల వద్ద ఆందోళన చేస్తు న్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్‌ చేయడం సరికాదని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అన్నారు. సామరస్యంగా పరిష్కరించాల్సిన సమస్యను ఉద్రిక్తంగా మార్చటం మంచిది కాదన్నారు. ప్రైవేటీకరణ వల్ల  నష్టపో కుండా విద్యార్థులకు న్యాయం చేయాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 


పోలీసుల దాడి హేయం : యూటీఎఫ్‌ నాయకులు

విద్యార్థి సంఘాల నాయకులు ఉద్యమ బాట పడితే ప్రభుత్వానికి నివేదిక ద్వారా తీవ్రతను తెలియజేయాల్సిన పోలీసు యంత్రాంగం ఎదురుదాడికి దిగటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జయ చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, రమణయ్య, జిలాన్‌, గోవిందరాజులు, ఇతర నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎందరో మేధావులను తయారుచేసిన ఎయిడెడ్‌ కళాశాలలు కనుమరుగు కాకుండా చూడాలన్నారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం జరిగేలా వాటిని కొనసాగించాలన్నారు.  


టీఎనఎస్‌ఎఫ్‌ నేతల ముందస్తు అరెస్ట్‌

విద్యార్థులపై లాఠీచార్జ్‌ నేపథ్యంలో నారా లోకేష్‌ బుధవారం అనంతకు వస్తున్నారు. దీంతో పోలీసులు ముందస్తు అరె్‌స్టలకు దిగారు. టీడీపీ అనుబంధ సంఘమైన టీఎనఎ్‌సఎ్‌ఫ, తెలుగుయువత నాయకులపై పో లీసులు దృష్టి పెట్టారు. లోకేష్‌ వచ్చినప్పుడు విద్యార్థులతో జరిగే కార్యక్రమాలు అడ్డుకోవడానికి టీఎనఎ్‌సఎ్‌ఫ తెలుగుయువత కీలక నేతలు ధనుంజయనాయుడు, బండి పరుశురాం, నారాయణస్వామి, సుధాకరయాదవ్‌, జగదీశ, బాలా లోకేష్‌, తదితరులను పోలీసులు ముందస్తు అరె్‌స్టలు చేసి స్టేషనలో పెట్టుకున్నారు. దీన్ని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టి వెంటనే వారిని విడుదల చేయాలని పోలీస్‌ అధికారులకు విజ్ఞప్తి చేశారు.


విద్యార్థి సంఘాల నాయకుల అరెస్ట్‌

నగరంలోని ఎస్‌ఎ్‌సబీఎన కళాశాలలో ఎయిడెడ్‌ కళాశాల ప్రైవేటీక రణను నిరసిస్తూ  సోమవారం శాంతియుత ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఎస్‌ఎ్‌ఫఐ ప్రధాన కార్యదర్శి సూర్య చంద్రయాదవ్‌, ఏఐఎ్‌సఎఫ్‌ ప్రధాన కార్యదర్శి మనోహర్‌, రమణయ్యలను టూటౌన పోలీసులు అరెస్ట్‌ చేశారు. నేరుగా కళాశాల నుంచి టూటౌన పోలీసుస్టేషనకు  తరలించారు. అనంతరం సాయంత్రం వారిని పోలీసులు వదిలి పెట్టారు. 


 నేడు విద్యాసంస్థల బంద్‌

 ఎస్‌ఎస్‌ బీఎన కళాశాల విద్యార్థులు, విద్యార్థి సంఘం నాయకులపై పోలీసుల లాఠీచార్జ్‌కు నిరసనగా మంగళవారం జిల్లాలో విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా  ప్రధాన కార్యదర్శి మనోహర్‌, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పరమేష్‌, సూర్యచంద్ర యాదవ్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఆనం ద్‌, ప్రధాన కార్యదర్శి సంతో్‌షకుమార్‌, టీఎనఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి బండి పరుశురామ్‌, అనంతపురం పార్లమెంట్‌ అధ్య క్షుడు ధనుంజయనాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్‌ యాదవ్‌,  పీడీఎ్‌సయూ జిల్లా కార్యదర్శి వీరేంద్రలు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎయిడెడ్‌ పాఠశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంతవరకు ఉ ద్యమాన్ని ఆపేది లేదని, పోలీసుల దౌర్జన్యకాండకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. విద్యార్థులపై దాడికి పాల్పడిన పోలీసులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, వెంటనే విధుల నుంచి తొలగించి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.  


బంద్‌ను విజయవంతం చేయండి

ఎస్‌ఎ్‌సబీఎన కళాశాల విద్యార్థులపై లాఠీచార్జ్‌కు నిరసనగా మంగళవారం తలపెట్టిన విద్యాసంస్థల బంద్‌ ను విజయవంతం చేయాలని ఎస్కేయూ విద్యార్థి సంఘా ల నాయకులు వేమన్న, వీరు యాద్‌ సోమవారం ప్రకటనలో కోరారు.  శాంతియుతంగా నిరసనచేపట్టిన విద్యార్థులను, విద్యార్థి సంఘాల నాయకులను వైసీపీ ప్రభుత్వం అమానుషంగా కొట్టించడం హిట్లర్‌ అరాచకాన్ని తలపిస్తోందన్నారు. ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టేందుకు చేపడుతున్న విద్యాసంస్థల బంద్‌కు ప్రజలు సహకరించాలని కోరారు.


 ఘటనపై విచారణకు ఆదేశం

ఎస్‌ఎ్‌సబీఎన కళాశాల ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కళాశాల విద్య కమిషనర్‌ (సీసీఈ) పోలా భాస్కర్‌ ఆదేశాల మేరకు విచారణాధికారిగా ఆర్‌జేడీ నాగలింగారెడ్డి కళాశాలకు వచ్చారు. కళాశాల యాజమాన్యం, ఇతర అధికారులను విచారించారు. తీవ్రంగా గాయపడిన జయలక్ష్మిని పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై ఆర్‌జేడీ మాట్లాడుతూ...కమిషనర్‌ ఆదేశాల మేరకు విచారణ చేశామన్నారు. ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని పేర్కొన్నారు.  


రెండు రోజులు కళాశాలకు సెలవు

కళాశాలలో చోటుచేసుకున్న సంఘటనల నేపథ్యంలో ప్రిన్సిపాల్‌ మురళి కళాశాలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు. ఈ నెల 9, 10 తేదీల్లో కళాశాలకు సెలవు ఇచ్చినట్లు ప్రిన్సిపాల్‌  ఒక ప్రకటనలో తెలిపారు.  

Updated Date - 2021-11-09T07:12:20+05:30 IST