మూత్రం రంగే అన్నీ చెప్పేస్తుంది.. ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో టాయ్‌లెట్ ఉంటే అర్థం ఏమిటంటే..

Published: Tue, 19 Oct 2021 12:57:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మూత్రం రంగే అన్నీ చెప్పేస్తుంది.. ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో టాయ్‌లెట్ ఉంటే అర్థం ఏమిటంటే..

ఆంధ్రజ్యోతి(19-10-2021): మూత్రం మాట్లాడకపోవచ్చు. కానీ దాని రంగు పలురకాల ఆరోగ్య పరిస్థితులను తెలుపుతుంది. కాబట్టి రంగును బట్టి సమస్యను అంచనా వేయగలిగే వీలుంది.


తేలికపాటి పసుపుపచ్చ: సరిపడా నీళ్లు తాగే ఆరోగ్యవంతుల మూత్రం ఈ రంగులోనే ఉంటుంది. కాబట్టి కంగారు పడవలసిన అవసరం లేదు.


ముదురు పసుపుపచ్చ: ఒంట్లో నీళ్లు తగ్గాయని అర్థం. కామెర్లు సోకినా మూత్రం ఇదే రంగులో ఉంటుంది.


ఆకుపచ్చ: నీలం రంగు ఫుడ్‌ కలర్‌ వేసిన పదార్థాలు తినడం మూలంగా ఆకుపచ్చ మూత్రం తయారవుతుంది.


అస్పష్టంగా: మూత్రం పారదర్శకంగా లేకుండా మసకగా కనిపిస్తే, అవసరానికి మించి ప్రొటీన్‌ తింటున్నారని అర్థం. 


తెల్లని మేఘాలు: మూత్రంలో తెల్లని మేఘాల్లాంటి ఆకారాలు కనిపిస్తే, మూత్రాశయ ఇన్‌ఫెక్షన్‌గా భావించాలి. మూత్రవిసర్జన సమయంలో మంట, తరచుగా మూత్రవిసర్జన చేయవలసి రావడం లాంటి లక్షణాలు కూడా ఉంటే వైద్యులను సంప్రతించాలి.


ముదురు గోధుమ రంగు: కామెర్లు, ఇతరత్రా కాలేయ సమస్యల్లో ఇలా జరుగుతుంది.


ఎరుపు: మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు, కేన్సర్‌ లాంటి అనారోగ్యాల్లో ఈ పరిస్థితి ఉంటుంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.