పురుషులకు వయాగ్రా లాగే.. స్త్రీలలో లైంగిక శక్తిని పెంచే మందులేంటో తెలుసా..? కోరికలు తగ్గడానికి కారణాలేంటంటే..

Published: Tue, 30 Nov 2021 13:35:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పురుషులకు వయాగ్రా లాగే.. స్త్రీలలో లైంగిక శక్తిని పెంచే మందులేంటో తెలుసా..? కోరికలు తగ్గడానికి కారణాలేంటంటే..

ఆంధ్రజ్యోతి(30-11-2021)

వయగ్రా.. లైంగిక శక్తిని పెంచే మందులు అనగానే అందరికి గుర్తుకొచ్చే పేరు. అయితే ఇది ప్రత్యేకంగా పురుషుల కోసం ఉచ్దేశించినది. మరి మహిళలకు ఇలాంటి మందులు ఉన్నాయా? ముఖ్యంగా రుతుస్రావం ఆగిపోయిన (మోనోపాజ్‌) దశలో ఉన్న మహిళలకు లైంగిక శక్తిని పెంచే మందులున్నాయా?వాటిని ఎలా వాడాలి? మొదలైన విషయాలు తెలుసుకుందాం.  


వయసుతో నిమిత్తం లేకుండా దాంపత్య జీవితం సరదాగా సాగుతూనే ఉండాలనుకొనేవారు అనేక మంది. అయితే మోనోపాజ్‌ దశలో మహిళలకు ఎదురయ్యే హార్మోన్‌ సమస్యల వల్ల కోరికలు తగ్గే అవకాశముంది. దీనికి కొన్ని కారణాలూ ఉన్నాయి. 


సాధారణంగా మోనోపాజ్‌ దశలో మహిళల్లో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ తగ్గుతూ వస్తుంది. ఈ హార్మోన్‌ తగ్గటం వల్ల - లైంగిక కోర్కెలు, జననాంగాల్లో లూబ్రికేషన్‌, తేమ వంటివి తగ్గుతాయి. ఇలాంటి శారీరక మార్పులే కాకుండా- మానసికంగా కూడా ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల లైంగికంగా వారిలో చురుకుదనం తగ్గిపోతుంది. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సాధారణంగా రెండంచెల వ్యూహాన్ని అనుసరించాలి. వీటిలో మొదటిది- ఈస్ట్రోజన్‌ ఉన్న జెల్‌, ల్యూబ్రికెంట్స్‌, క్రీమ్‌ల వాడకం. వీటి వల్ల శారీరకంగా ఉండే అసౌకర్యం తగ్గుతుంది. ఇక రెండోది- టెస్టోస్టిరాన్‌ సప్లిమెంట్ల వాడకం. వీటితో లైంగిక కోరికలు కొంత వరకూ పెరుగుతాయి. అయితే ఇవి హార్మోన్‌ సప్లిమెంట్లు కాబట్టి చాలా జాగ్రత్తగా వాడాలి. సాధారణంగా ఈ మందులను వాడినప్పుడు- మొదట్లో తలనెప్పి, వాంతులు, తల తిరగటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొద్ది కాలానికి ఇది తగ్గిపోతాయి. ఈ మందులను ఎంత కాలం వాడాలనేది వైద్యులు నిర్ధారిస్తారు.  ఈ మందులతో పాటుగా ఈ మధ్యకాలంలో లైంగిక శక్తిని పెంచే మరి కొన్ని మందులు కూడా అందుబాటులోకి వచ్చాయి. పురుషులకు వయాగ్రా మాదిరిగానే ఇవి మహిళలపై పనిచేస్తాయి. 


ఫిమేల్‌ వయాగ్రాగా పిలుచుకొనే ఈ మందులను వాడినప్పుడు మెదడు నుంచి డోపమిన్‌, సెరటోనిన్‌ హార్మోన్ల విడుదల పెరుగుతుంది. దీని వల్ల మహిళల్లో కూడా లైంగిక ఆసక్తి పెరుగుతుంది. వీటిని కూడా వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి.  ఈ మందులను ఎక్కువ కాలం వాడేవాళ్లు వైద్యుల సూచన మేరకు పాప్‌స్మియర్‌, మోమోగ్రామ్‌ వంటి పరీక్షలను చేయించుకోవాలి. 


ఇతర ప్రయోజనాలు..

మెనోపాజ్‌ దశలో ఈస్ర్టోజన్‌ హార్మోన్‌ తగ్గిపోవడం మూలంగా ఎముకల సాంద్రత కూడా తగ్గుతుంది. దాంతో ఎముకలు పెళుసుగా మారతాయి. ప్రమాదవశాత్తూ కింద పడ్డప్పుడు, తుంటి ఎముకలు తేలికగా విరిగిపోతూ ఉండడానికి కారణం ఇదే! అలాగే వీళ్లలో చర్మం కూడా పొడిబారుతుంది. ఎముకలు, కండరాల నొప్పులు వేధిస్తూ ఉంటాయి. ఒంటి నుంచి వేడి ఆవిర్లు వెలువడడం, రాత్రుళ్లు నిద్ర తగ్గిపోవడం లాంటి మెనోపాజ్‌ ఇబ్బందులన్నీ ఈస్ర్టోజన్‌ సప్లిమెంట్స్‌తో మెరుగవుతాయి. ఇక కొందరిలో ప్రసవం తర్వాత లైంగిక కోరికలు బాగా తగ్గిపోతాయి. ఇలాంటి వారికి కూడా ఈ మందులు ఎంతో పనికొస్తాయి. 


సెక్స్‌ వల్ల ప్రయోజనాలెన్నో... 

జననావయవాలకు రక్తప్రసరణ మెరుగై లైంగిక వ్యవస్థలో అనేక అనుకూల మార్పులు వస్తాయి


ఎండార్ఫిన్లు, డోపమిన్‌ లాంటి హ్యాపీ హార్మోన్లు విడుదలై చురుకుదనం పెరుగుతుంది.


హ్యాపీ హార్మోన్లతో చర్మం యవ్వనంతో మెరుస్తూ ఉంటుంది.


దాంపత్య బంధం బలపడుతుంది.


కోరికలు తగ్గటానికి కారణాలు

లైంగిక కోరికలు తగ్గడానికి మానసిక కారణాలూ ఉండవచ్చు. ఒత్తిడి, కుంగుబాటు, కుటుంబంలో గొడవలు, దంపతుల మధ్య సఖ్యత లోపించడం, మారిన శరీరాకృతి గురించిన ఆత్మన్యూనత, ఎవరైనా కనిపెడతారేమోననే భయం, ఆందోళన.. లాంటివి ఉన్నప్పుడు మహిళల్లో లైంగికాసక్తి తగ్గుతుంది. 

పురుషులకు వయాగ్రా లాగే.. స్త్రీలలో లైంగిక శక్తిని పెంచే మందులేంటో తెలుసా..? కోరికలు తగ్గడానికి కారణాలేంటంటే..

వయాగ్రా ఎలా పనిచేస్తుంది? 

పురుషుల్లో హార్మోన్‌ సమస్యలు, అంగంలోని రక్తనాళాల్లో అడ్డంకులతో తలెత్తే అంగస్తంభనలకు చికిత్సలున్నాయి. చికిత్సతో పరిస్థితి అదుపులోకి రాని వారి కోసం ఉద్దేశించినవే వయాగ్రా మాత్రలు. 25  100 మిల్లీ గ్రాముల మోతాదు కలిగిన ఈ మాత్రలను కూడా వైద్యుల సూచన మేరకే వాడుకోవాలి. వయాగ్రాను కేవలం ఒక ఔషధంలానే వాడాలి. హృద్రోగ సమస్యలు ఉన్న వాళ్లు వీటిని వాడకూడదు.


పురుషులకు వయాగ్రా లాగే.. స్త్రీలలో లైంగిక శక్తిని పెంచే మందులేంటో తెలుసా..? కోరికలు తగ్గడానికి కారణాలేంటంటే..

సెల్ఫ్‌ టెస్ట్‌

ఈ కింద ఇచ్చి కొన్ని ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం వెతికితే మోనోపాజ్‌ దశలో ఎదురయ్యే లైంగిక సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చు. 


ఆ ఆసక్తి సహజంగానే లోపించిందా? లేక                                                

ఆసక్తిని పట్టించుకోవడం మానేశారా?

ఈ వయసులో ఇవన్నీ అవసరమా? అనేది మీ ఆలోచనా?

పెద్దవాళ్లం అయిపోయాం కాబట్టి ఆ అవసరానికి స్వస్తి చెప్పాలనేది మీ ఉద్దేశమా?

ఎవరైనా పసిగడతారేమోననేది మీ భయమా?

శరీరం తీరు గురించిన ఆత్మన్యూనతా?నొప్పి, అసౌకర్యం కారణమా?

యూరినరీ ఇన్‌ఫెక్షన్ల గురించిన భయమా?


పురుషులకు వయాగ్రా లాగే.. స్త్రీలలో లైంగిక శక్తిని పెంచే మందులేంటో తెలుసా..? కోరికలు తగ్గడానికి కారణాలేంటంటే..

మనసు విప్పి చెప్పాలి

నలత చేస్తే వైద్యులకు ఉన్నది ఉన్నట్టు చెప్పే చాలా మంది మహిళలు లైంగిక సమస్యల విషయానికి వచ్చే సరికి మౌనం వహిస్తారు. పురుషుల్లో మాదిరిగానే మహిళల్లో కూడా లైంగికాసక్తి పెరుగుతూ ఉంటుంది. తగ్గుతూ ఉంటుంది. లైంగికాసక్తి తగ్గే పరిస్థితిని ఫిమేల్‌ సెక్సువల్‌ డిస్‌ఫంక్షన్‌ అంటారు. ఇలాంటి పరిస్థితిని వైద్యుల దృష్టికి తీసుకువస్తే వారు తగిన మార్గాలు సూచిస్తారు. 

పురుషులకు వయాగ్రా లాగే.. స్త్రీలలో లైంగిక శక్తిని పెంచే మందులేంటో తెలుసా..? కోరికలు తగ్గడానికి కారణాలేంటంటే..

డాక్టర్‌ శిల్పి రెడ్డి

గైనకాలజిస్ట్‌ అండ్‌ 

అబ్‌స్టెట్రీషియన్‌,

కిమ్స్‌, హైదరాబాద్‌.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.