కేజీబీవీ ఉద్యోగులకు ఎంటీఎస్‌ అమలు చేయండి

ABN , First Publish Date - 2021-06-23T06:17:34+05:30 IST

కేజీబీవీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం ట్రైం స్కేల్‌ (ఎంటీఎస్‌) వెంటనే అమలు చేయలని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు వెంకటేశ్వరరావు, సాబ్జి, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమాఖ్య నాయకులు.. సమగ్రశిక్ష ఎస్పీడీ వెట్రిసెల్వీని కోరారు.

కేజీబీవీ ఉద్యోగులకు ఎంటీఎస్‌ అమలు చేయండి
ఎస్పీడీతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ, నాయకులు


ఎస్పీడీకి పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు, ఇతర నేతల వినతి


అనంతపురం విద్య, జూన్‌ 22 : కేజీబీవీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం ట్రైం స్కేల్‌ (ఎంటీఎస్‌) వెంటనే అమలు చేయలని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు వెంకటేశ్వరరావు, సాబ్జి, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమాఖ్య నాయకులు.. సమగ్రశిక్ష ఎస్పీడీ వెట్రిసెల్వీని కోరారు. మంగళవారం ఎస్పీడీని ఎమ్మెల్సీలతోపాటు ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బాలకాని, జిల్లా అధ్యక్షుడు విజయ్‌ కలిశారు. వారు మాట్లాడుతూ... ఈ నెల 18వ తేదీ జారీ చేసిన జీఓ 40ని అమలు చేయాలని కోరారు. సమగ్రశిక్షలో పనిచేసే అన్ని కేడర్ల కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌, పార్ట్‌టైం, కేజీబీవీల్లో పనిచేస్తున్న టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ ఉద్యోగులందరికీ,  కాలేజీల్లో పనిచేస్తున్న పీజీటీలకు ఈ ఉత్తర్వులను అమలు చేసి, న్యాయం చేయాలని కోరారు. 2019 ఏప్రిల్‌ 1 నుంచి మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అమలు చేయాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందించారు. 


Updated Date - 2021-06-23T06:17:34+05:30 IST