ఇండియా - ఏ మహిళా జట్టుకు అనూష

Nov 29 2021 @ 01:12AM

అనంతపురం క్లాక్‌టవర్‌, నవంబరు 28 : ఇండియా-ఏ మహిళా జట్టుకు జిల్లాకు చెం దిన అనూష ఎంపికైంది. బీసీసీఐ చాలెం జర్స్‌ సిరీస్‌ డిసెంబరు 4వ తేదీ నుంచి విజ యవాడలో జరగనుందని, ఇందులో నాలుగు జట్లు పాల్గొంటాయన్నారు. ఇండియా ఏ మ హిళా జట్టునుంచి అనూషా ప్రాతినిధ్యం వహించనుంది. అలాగే ఆంధ్రాక్రికెట్‌ అసోసియేషన జట్టుకు జిల్లాకు చెందిన గిరినాథ్‌రెడ్డి, షోయబ్‌ఖాన ఎంపికయ్యారు. జట్టు మేనేజర్‌గా జిల్లాకు చెందిన మాజీ రంజీ క్రీడాకారుడు ఎల్‌ఎన ప్రసాద్‌రెడ్డి నియమితుడ య్యారు. డిసెంబరు 3 నుంచి ముంబయిలో జరిగే బీసీసీఐ విజ య్‌హజారే ట్రోఫీలో ఆంధ్రాజట్టు తరపున ప్రాతినిధ్యం వహిసా ్తరు. ఎంపికైన క్రీడాకారులకు జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్ష, కార్య దర్శులు పగడాల మల్లికార్జున, మధు అభినందనలు తెలిపారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.