ఉద్యాన పంటలకు రూ.4.5 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు

ABN , First Publish Date - 2020-10-27T07:11:21+05:30 IST

జిల్లాలో ఈ ఏడాది మే నుంచి సెప్టెంబర్‌ వరకు కురసిన భారీ వర్షాలు, వరదల వల్ల ఉద్యాన పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఉద్యాన పంటలకు రూ.4.5 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), అక్టోబరు 26: జిల్లాలో ఈ ఏడాది మే నుంచి సెప్టెంబర్‌ వరకు కురసిన భారీ వర్షాలు, వరదల వల్ల ఉద్యాన పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 7 జిల్లాలకు రూ.22 కోట్లు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ మంజూరు కాగా, అందులో జిల్లాకు రూ.4.50 కోట్లు వరకు నిధులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ జీవో నంబరు 104 జారీ చేసింది. 

వరి పంటకు కూడా.. 

ఇదే సీజన్‌లో గోదావరి వరదలకు జిల్లాలో వరి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు చేసింది. 10 జిల్లాలకు కలిపి రూ 100 కోట్ల వరకు ప్రభుత్వం మంజూరు చేయగా, అందులో జిల్లాకు రూ 12 కోట్ల నుంచి రూ 14 కోట్ల వరకు నిధులు రానున్నాయి. ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ జీవో నంబరు 103 జారీ చేసింది. 



Updated Date - 2020-10-27T07:11:21+05:30 IST