‘రైతుబజార్‌ క్రమబద్ధీకరణపై విచారణ జరపాలి’

May 8 2021 @ 23:29PM

జిన్నారం, మే 8: బొల్లారం రైతుబజార్‌ అక్రమ క్రమబద్ధీకరణపై సమగ్ర విచారణ జరిపి భూమిని స్వాధీనం చేసుకోవాలని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అనిల్‌రెడ్డి కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. రూ.3కోట్ల విలువైన రైతుబజార్‌ స్థలాన్ని ఒకరు జీవో 59కింద క్రమబద్ధీకరణ చేయించుకున్నారని ఆరోపించారు. దీనిపై సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అనిల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. విలువైన స్థలాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.Follow Us on: