ఉద్యోగాల ఎంపికకు ఇంటర్వ్యూలు రేపు

ABN , First Publish Date - 2022-07-05T05:02:37+05:30 IST

ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో బుధవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్‌ ఎన్‌.గోవిందరావు తెలిపారు. ఇండస్ట్రీ కస్టమైజ్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాంలో భాగంగా దక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌ (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్‌లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

ఉద్యోగాల ఎంపికకు ఇంటర్వ్యూలు రేపు

ఎచ్చెర్ల, జూలై 4: ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో బుధవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్‌ ఎన్‌.గోవిందరావు తెలిపారు.  ఇండస్ట్రీ కస్టమైజ్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాంలో భాగంగా దక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌ (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్‌లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రొడక్షన్‌ విభాగంలో ట్రైనీ కెమిస్ట్‌ ఉద్యోగాల కోసం బీఎస్సీ (కెమిస్ట్రీ/ బీజడ్‌సీ) చదివిన అభ్యర్థులు అర్హులని, నెలకు జీతం రూ.19,477 వరకూ ఉంటుందన్నారు. ప్రొసెస్‌ విభాగంలో ట్రైనీ కెమిస్ట్‌ ఉద్యోగాలకు ఎంఎస్సీ (ఆర్గానిక్‌ కెమిస్ట్రీ/ అనలెటికల్‌ కెమిస్ట్రీ) చదివిన అభ్యర్ధులు అర్హులని, వీరికి నెలకు జీతం రూ.21,165 వరకూ ఉంటుందని చెప్పారు. 2016-22 సంవత్సరాల మధ్యలో ఉత్తీర్ణులై 18-27 ఏళ్ల లోపు వయసు గల పురుష అభ్యర్థులు అర్హులన్నారు. శ్రీకాకుళం నగరంలోని బలగ జంక్షన్‌కు సమీపంలో నెహ్రూ యువ కేంద్రం ఆవరణలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని చెప్పారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్ధులు హాజరుకావాలన్నారు. వివరాల కోసం 6301045132, 8317652552 నంబర్లకు సంప్రదించాలన్నారు.

 

Updated Date - 2022-07-05T05:02:37+05:30 IST