జాతీయస్థాయి కళాకుంభ్‌ ప్రదర్శనలో ప్రసాద్‌కు ప్రశంసలు

ABN , First Publish Date - 2022-01-22T06:24:30+05:30 IST

ఆజాదికా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా జాతీయస్థాయిలో నిర్వహించిన కళాకుంభ్‌ చిత్రాల ప్రదర్శనలో భట్నవిల్లి గ్రామానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు పీసీ ప్రసాద్‌ గీసిన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య చిత్రానికి అందరి ప్రశంసలు లభించాయి.

జాతీయస్థాయి కళాకుంభ్‌ ప్రదర్శనలో ప్రసాద్‌కు ప్రశంసలు

అమలాపురం రూరల్‌, జనవరి 21: ఆజాదికా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా జాతీయస్థాయిలో నిర్వహించిన కళాకుంభ్‌ చిత్రాల ప్రదర్శనలో భట్నవిల్లి గ్రామానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు పీసీ ప్రసాద్‌ గీసిన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య చిత్రానికి అందరి ప్రశంసలు లభించాయి. ఒడిసా రాజధాని భువనేశ్వర్‌లో నిర్వహించిన ఈకార్యక్రమంలో స్వాతంత్రోద్యమ ఘట్టాలను చిత్రీకరించేందుకు దేశవ్యాప్తంగా 350మంది చిత్రకారులు హాజరుకాగా తెలుగు రాష్ర్టాల నుంచి భట్నవిల్లికి చెందిన ప్రసాద్‌తో పాటు మరో ఎనిమిది మంది చిత్రకారులు అమృత్‌ మహోత్సవా ల్లో పాలు పంచుకున్నారు. ఈనెల26న ఈచిత్రాన్ని ఢిల్లీలో ప్రదర్శించను న్నట్టు నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడరన్‌ ఆర్ట్స్‌ ప్రతినిధులు తెలిపారు. 

Updated Date - 2022-01-22T06:24:30+05:30 IST