మాజీ సైనికులకు ఉద్యోగ అవకాశాలు

ABN , First Publish Date - 2021-02-28T05:39:28+05:30 IST

పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జిల్లా లోని మాజీ సైనికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తు న్నట్టు జిల్లా సైనిక సంక్షేమాధికారి జి.సత్యానందం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మాజీ సైనికులకు ఉద్యోగ అవకాశాలు

గుజరాతీపేట: పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జిల్లా లోని మాజీ సైనికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తు న్నట్టు జిల్లా సైనిక సంక్షేమాధికారి జి.సత్యానందం  ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్టేషన్‌ కమాండర్‌,  విశాఖపట్నం ఈసీహెచ్‌ఎస్‌ పోలీక్లీనిక్స్‌, శ్రీకాకుళం, కాకినాడల్లో ఆఫీసర్‌ ఇన్‌చార్జ్‌, మెడికల్‌ స్పెషలిస్ట్‌, మెడికల్‌, డెంటల్‌ ఆఫీసర్స్‌, ల్యాబ్‌టెక్నీషియన్‌, ల్యాబ్‌, నర్సింగ్‌ అసిస్టెంట్స్‌, పార్మసిస్ట్‌, డెంటల్‌ అసిస్టెంట్‌/ టెక్నీషియన్‌/హైజనిస్టు,  డ్రైవర్‌, క్లర్క్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ప్యూన్‌, చౌకీదార్‌, సపాయివాలా, ఐటీ టెక్నీషియన్‌, ఫీమేల్‌ అటెండెంట్‌ ఉద్యోగాల కోసం మా జీ సైనికుల నుంచి దరఖా స్తులు  కోరుతున్నట్లు చెప్పారు. మార్చి 3లోగా ద ఆఫీసర్‌ ఇన్‌చార్జ్‌, స్టేషన్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఈసీహెచ్‌ఎస్‌, ఐఎన్‌సీఎస్‌ కాంప్లెక్స్‌, ఐఎన్‌ఎస్‌ సిర్కర్స్‌, నావెల్‌ బేస్‌, విశాఖపట్నం 530 014 చిరునామాకు దరఖాస్తులను కొరియర్‌ లేదా స్పీడ్‌/ ఆర్డినరీ పోస్టులో మాత్రమే పంపించాలని తెలిపారు. పూర్తి వివరాలకు శ్రీకాకుళం ఈసీహెచ్‌ఎస్‌ నంబర్‌(08942-271020) ను సంప్రదించాలని సూచించారు.


Updated Date - 2021-02-28T05:39:28+05:30 IST