ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి

ABN , First Publish Date - 2022-07-01T05:25:29+05:30 IST

గజ్వేల్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చేరాలంటూ కళాశాల అధ్యాపకులు గురువారం గజ్వేల్‌ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తిరిగి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి

 గజ్వేల్‌, జూన్‌ 30: గజ్వేల్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చేరాలంటూ కళాశాల అధ్యాపకులు గురువారం గజ్వేల్‌ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తిరిగి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కళాశాల విద్యార్థులు సాధించిన ర్యాంకులను, కళాశాలలో గల సౌకర్యాల గురించి ఇంటర్‌ పాసైన విద్యార్థులకు వివరించారు. జూలై 1 నుంచి దోస్త్‌ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 


 


Updated Date - 2022-07-01T05:25:29+05:30 IST