కర్ణాటక మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-08-12T05:16:41+05:30 IST

చిత్తూరు పోలీసులు గురువారం కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు.

కర్ణాటక మద్యం పట్టివేత
మద్యం, నిందితులను చూపిస్తున్న డీఎస్పీ సుధాకర్‌రెడ్డి

రూ.25లక్షల విలువైన మద్యం, వాహనాల సీజ్‌

నలుగురు నిందితుల అరెస్టు

మీడియా సమావేశంలో డీఎస్పీ సుధాకర్‌రెడ్డి వెల్లడి

చిత్తూరు, ఆగస్టు 11: చిత్తూరు పోలీసులు గురువారం కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి మద్యం, వాహనాలను సీజ్‌ చేశారు. ఈ వివరాలను గురువారం పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఒకటో పట్టణ సీఐ నరసింహరాజుతో కలిసి  డీఎస్పీ సుధాకర్‌రెడ్డి వెల్లడించారు. చిత్తూరుకు చెందిన కొందరు కర్ణాటక మద్యాన్ని తీసుకొచ్చి అమ్ముతున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఒకటో పట్టణ ఎస్‌ఐ వసంతకుమారి, రెండో పట్టణ ఎస్‌ఐ లోకేష్‌ సిబ్బందితో కలిసి నగరంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు చేశారు. ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మధుసూదన్‌రెడ్డి, మురళి, రెండో పట్టణ స్టేషన్‌ పరిధికి చెందిన రమేష్‌, కుమరేశన్‌ను పట్టుకున్నారు. వారి నుంచి రూ.9 లక్షల విలు వ కలిగిన కర్ణాటక మద్యం, రూ.16 లక్షల విలువైన మూడు కార్లను సీజ్‌ చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. మద్యాన్ని పట్టుకోవడంలో కృషి చేసిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Updated Date - 2022-08-12T05:16:41+05:30 IST