శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆర్ఎం సుమంత ఆర్ ఆదోని
అనంతపురం కల్చరల్, జూలై 5 : ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఇంధన పొదుపు మెళకువలను పాటించి, తద్వారా ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు సమష్టి కృషి చేద్దామని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుమంత ఆర్ ఆదోని సూచించారు. మంగళవారం ఆర్ఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో డ్రైవర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లా డారు. ప్రమాదాల నివారణకు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. వేలాది మందికి ఉపాధినిస్తున్న ఆర్టీసీని ఆదాయమార్గంలో పయనిం పజేసేందుకు కృషి చేయడం మనందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిప్యూటీ సీఎంఈ మోహనకుమార్, గుంతకల్లు డీఎం నారాయ ణస్వామి, గుత్తి డిపో ఎస్టీఐ రమణమ్మ, రాయదుర్గం ఎంఎఫ్ జయచంద్ర, వివిధ డిపోల డ్రైవర్లు పాల్గొన్నారు.