మాట్లాడుతున్న వీర్లపల్లి శంకర్
షాద్‌నగర్ అర్బన్, జూలై 5: హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వ ద్ద బుధవారం నిర్వహిస్తున్న ‘ధరణి రచ్చబండ’ కార్యక్రమానికి రై తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని షాద్‌నగర్ కాంగ్రెస్ నాయకుడు వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తెచ్చిన ధరణితో భూ సమస్యలు పెరిగి రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. సమస్యల ను పరిష్కరించాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టిం చుకోకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారన్నారు. ధరణిలోని లోపాలను వెంటనే సరిచేసి రైతుల సమస్యలను తీర్చాలనే డిమాం డ్తో కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ‘ధరణి రచ్చబండ’ను నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బాబర్ఖా న్, జి.బాల్‌రాజ్‌గౌడ్, చల్లా శ్రీకాంత్‌రెడ్డి, వెంకటనర్సింహారెడ్డి, రాం దాస్‌నాయక్, కోడూరు రాములు తలితరులు పాల్గొన్నారు.