జీవనయానం .. తప్పదీ ప్రయాణం ..!

ABN , First Publish Date - 2022-06-27T05:24:18+05:30 IST

జీవనం కోసం మహిళా కూలీలు చేసే ప్రయాణం ప్రమాదకరంగా ఉంటోంది. ఆటోలు, జీపుల్లో మహిళా కూలీలు పరిమితికి మించి ప్రయాణాలు చేసే దృశ్యాలు ఇక్కడ నిత్యకృత్యమయ్యాయి

జీవనయానం .. తప్పదీ ప్రయాణం ..!
యాడికిలో ఆటో టాపుపై ప్రయాణిస్తున్న మహిళా కూలీలు

యాడికి, జూన 26 : జీవనం కోసం మహిళా కూలీలు చేసే ప్రయాణం ప్రమాదకరంగా ఉంటోంది. ఆటోలు, జీపుల్లో మహిళా కూలీలు పరిమితికి మించి ప్రయాణాలు చేసే దృశ్యాలు ఇక్కడ నిత్యకృత్యమయ్యాయి. ‘ఉపాధి’ కోసం మహిళా కూలీలు ఆటో టాపుపై కూడా ఎక్కి ప్రయాణిస్తున్నారు. లగేజీ జీపుల్లో డబుల్‌ డెక్కర్‌ బస్సుల మాదిరి ఎక్కి పనులకు వెళ్తుండటం  పరిపాటిగా మారింది. ఆటోల యజమానులు కాసులకు కక్కుర్తిపడి ఏడుగురు ప్రయాణించాల్సిన వాహనంలో 20 మంది దాకా ఎక్కిస్తున్నారు. ఇక లగేజీ జీపుల్లో 40 మందికి పైగా కూలీలను తరలిస్తున్నారు. ఇలా ప్రయాణించి ప్రమాదానికి గురై కూలీలు మరణించిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఆ కొన్ని రోజులు మాత్రం హడావుడి చేసే అధికారులు ఆ తర్వాత అసలు పట్టించుకోవడం లేదు. 




Updated Date - 2022-06-27T05:24:18+05:30 IST