జాతీయ రహదారి విస్తరణలో కోల్పోతున్న ప్రార్థనా మందిరాలకు పరిహారం చెల్లించాలి

ABN , First Publish Date - 2021-05-10T05:36:42+05:30 IST

చౌటకూర్‌ మండలం సరా్‌ఫపల్లిలో సంగారెడ్డి- నాందేడ్‌, అకోలా 161 జాతీయ రహదారి విస్తరణలో కూల్చివేతకు గురవుతున్న ప్రార్థనా మందిరాలకు నష్టపరిహారం చెల్లించాలని బజరంగ్‌దళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ సుభా్‌షచందర్‌ డిమాండ్‌ చేశారు.

జాతీయ రహదారి విస్తరణలో కోల్పోతున్న  ప్రార్థనా మందిరాలకు పరిహారం చెల్లించాలి

పుల్‌కల్‌, మే 9: చౌటకూర్‌ మండలం సరా్‌ఫపల్లిలో సంగారెడ్డి- నాందేడ్‌, అకోలా 161 జాతీయ రహదారి విస్తరణలో కూల్చివేతకు గురవుతున్న ప్రార్థనా మందిరాలకు నష్టపరిహారం చెల్లించాలని బజరంగ్‌దళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ సుభా్‌షచందర్‌ డిమాండ్‌ చేశారు. రోడ్డు విస్తరణ పనుల్లో హనుమాన్‌ ఆలయంతో పాటు ఇతర గ్రామ దేవతల విగ్రహాలు కూల్చివేతకు గురవుతున్నప్పటికీ నష్టపరిహారం చెల్లింపులో జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ పక్షపాతం చూపుతోందని ఆదివారం గ్రామంలో నిరసన చేపట్టారు. సంగారెడ్డి-నాందేడ్‌, అకోలా 161 జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరిస్తుండడంతో అనేక ప్రార్థన మందిరాలు కోల్పోవాల్సి వస్తుందని విచారం వ్యక్తం చేశారు. ఆయా ఆలయాలను పునర్నిర్మించేందుకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఆ తర్వాతే రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాలను కూల్చేందుకు సిబ్బంది రావడంతో గ్రామస్థుల సహకారంతో అడ్డుకున్నారు. ఆందోళనకారులతో అధికారులు, కాంట్రాక్టు సంస్థ నిర్వాహకులు చర్చలు జరిపారు. ఆలయాలను పునర్నిర్మించేందుకు అవసరమైన సామగ్రిని ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. నిరసన కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పుల్లంగారి సురేందర్‌ముదిరాజ్‌, నాయకులు చిరంజీవి, సుమన్‌, సర్పంచ్‌ కరణం లక్ష్మీబాయి, రామచంద్రారెడ్డి, దివాకర్‌, పల్లె ప్రభుకుమార్‌గౌడ్‌, సురేష్‌, ప్రవీణ్‌, శ్రీకాంత్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.


 

Updated Date - 2021-05-10T05:36:42+05:30 IST