‘రైతులు - చేనేతల పోరు’ను విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2022-07-03T05:59:54+05:30 IST

రైతులు-చేనేతల సమస్యల పరిష్కారానికి ఈ నెల 4వ తేదీన సోమవారం ధర్మవరంలో చేపట్టే ధర్నాను వి జయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర కార్య దర్శి కమతం కాటమయ్య, పార్లమెంట్‌ అధి కార ప్రతినిధి పురుషోత్తంగౌడ్‌ పిలుపు నిచ్చా రు.

‘రైతులు - చేనేతల పోరు’ను విజయవంతం చేయండి
విలేకరులతో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

టీడీపీ నాయకులు

ధర్మవరం, జూలై 2: రైతులు-చేనేతల సమస్యల పరిష్కారానికి ఈ నెల 4వ తేదీన సోమవారం ధర్మవరంలో చేపట్టే ధర్నాను వి జయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర కార్య దర్శి కమతం కాటమయ్య, పార్లమెంట్‌ అధి కార ప్రతినిధి పురుషోత్తంగౌడ్‌ పిలుపు నిచ్చా రు. టీడీపీ స్థానిక కార్యాలయంలో శనివా రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం రైతులు, చేనేతల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని, ఇందుకు నిరసనగా మాజీ మంత్రి పరిటాలసునీత, టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టుు తెలిపారు. ముందుగా ఎన్టీఆర్‌ సర్కిల్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తామన్నారు. అక్కడి నుంచి భారీ ఎత్తున ర్యాలీ గా వెళ్లి ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామన్నారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని ముడిపట్టు సరుకుల ధరలను అదుపుచేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీలు పెంచి రెండునెలలుగా గడువకనే మళ్లీ పెంచేశారన్నారు. ఽధర్నాకు ధర్మవరం నియోజకవర్గంతో పాటు రాప్తాడు నియోజక వర్గంలోని రామగిరి, చెన్నేకొత్తపల్లి, కన గానపల్లి మండలాల నుంచి భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని వారు కోరారు. కార్యక్రమంలో నాయకులు బోయ రవిచంద్ర, పరిశే సుధాకర్‌, నాగూర్‌ హుస్సేన, పోతుకుంట లక్ష్మన్న, మేకల రామాంజనేయులు, సాహెబ్బీ, బీబీ, గోసల శ్రీరాములు, రాళ్లపల్లి షరీఫ్‌, చిన్నూరు విజయ్‌చౌదరి, మిడతల యుగంధర్‌, తోట వాసుదేవ, చెలిమి శివరాం తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-03T05:59:54+05:30 IST